Publish Date:Jul 23, 2022
మేకకి పులి భయం, పాముకి కుక్కభయం, దొంగకి పోలీసు భయం.. ఇవి సహజం. ఇప్పుడు కొత్తగా వింటున్నది బ్యాంకులే ప్రభుత్వాన్ని దూరం పెడుతున్నాయి. జగన్ ఏ క్షణాన వచ్చి ఎన్ని కోట్లు అడుగుతారో అని భయపడుతున్నాయి. రకరకాల ఒత్తిళ్లతో కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి మరీ అప్పులు పుట్టించుకున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు అవే బ్యాంకుల నుంచి రివర్స్‌లో షాకులు తగిలే పరిస్థితి కనిపిస్తు న్నది. వేల కోట్ల రుణాలను సరైన తనఖా,ఆదాయం,చెల్లింపుల పరిస్థితి లేకుండానే బ్యాంకులు ఇచ్చేశాయి.
ఇంకా తెచ్చుకు నేందుకు ఏపీ ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించింది. కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి ఎస్‌బీఐకి చైర్మన్‌గా పని చేసిన వారిని సలహాదారులుగా నియమించుకుని మరీ ఈ అప్పులు తెస్తోంది. అలాంటి వారి పలుకు బడితో పెద్దఎత్తున అప్పులు తెచ్చింది జగన్ సర్కార్. అంతేగా, గుడిలో ప్రసాదం కావాలంటే పంతులు గారితో రవ్వంత స్నేహం అవసరంగదా! అయితే నిజానికి అలాంటి అప్పులు తేవడానికి నిబంధనలు అంగీకరించవు. బ్యాంకులు కూడా ఇవ్వలేవు . కానీ తప్పుడు మార్గాల్లో ప్రయత్నించారు. కార్పొరేషన్లకు లేని ఆదాయాన్ని చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిటేడెట్ ఫండ్ నుంచి డబ్బులు చెల్లిస్తామంటే సరే అన్నారు.
కానీ ఇలాంటివి అరికట్టడానికి నిబంధనలను ఆర్బీఐ ఎప్పుడో పెట్టింది. ప్రభుత్వాలకు అప్పు ఇచ్చేపద్దతులను వివ రించింది. కానీ బ్యాంకులు ఇప్పుడు ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించాయి. కాస్త లేటైనా ఇప్పుడు ఆర్బీఐ ఆ అంశంపై దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకులకు ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక వేళ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించి మరీ అప్పులిచ్చినట్లుగా తేలితే, ఆ బ్యాంకులకు జరిమానా విధిస్తారు.
అదో పెద్ద మైనస్ అవుతుంది. ఇలా అప్పులు తెచ్చుకున్న ఏపీకి రుణాలివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఏపీ అప్పుల్లో అసలు విషయం ఏమిటంటే.. అసలు ఏ బ్యాంక్ నుంచి ఎన్ని వేల కోట్లు తెచ్చారో స్పష్టత లేదు. ఏం లెక్క చెప్పారు. ఏం తాకట్టు పెట్టారు. ఎలా అప్పులిచ్చా రన్న వివరాలు లేవు. ఆ అప్పులను ఏపీ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. బ్యాంకులూ అంతే. ఈ గోల్ మాల్ వ్యవహారం ముందు ముందు కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం పెద్దగా పట్టించుకోని ఆర్బీఐ కూడా ఇప్పుడు సీరి యస్‌గా చర్యలు తీసుకుంటోంది. దీంతో మొత్తం లోగుట్టు బయటపడే అవకాశం కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/where-is-the-way-to-clear-debts-25-140351.html
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!