ఇంతకీ ఆ డబ్బెక్కడ ?

Publish Date:Oct 31, 2022

Advertisement

జగన్ ప్రభుత్వంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసిందా? అందుకే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తు పెట్టుకోమంటూ ..  ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ బాధ్యుడు సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పలుమార్లు చెబుతున్నారా? ఆ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై.. కేంద్రంలోని పెద్దలు..షంటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? అంటే తాజా పరిణామాలను బట్టి చూడబోతే..  అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా నిర్మలా సీతారామన్.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో పర్యటించిన సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలను వారు ఈ సందర్బంగా సోదాహరణగా వివరిస్తున్నారు.  

వీరవాసరం మండలంలోని మత్స్యపూరి గ్రామాన్ని నిర్మల సీతారామన్ గతంలో దత్తత తీసుకున్నారని.. సదరు గ్రామంలో తాజాగా ఆమె రక్షిత మంచి నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారని.. ఆ క్రమంలో పరిసర ఆరు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైందా? అంటూ అక్కడే ఉన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను ఆమె ప్రశ్నించగా... అందుకు ఆయన కాలేదంటూ సమాధానం ఇవ్వడంతో.. ఈ కేంద్ర మంత్రి గారు ఒక్కసారిగా అవాక్కు అయ్యారని.. తాను 2019 ఎన్నికల ముందే ఈ ఆరు గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కరించడం కోసం కోటి రూపాయిలకు పైగా నిధులు విడుదల చేశానని.. నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లితే.. ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని..... కానీ అప్పుడు విడుదల చేసిన నిధుల తాలుక లెక్క ఏమైందో.. మీ సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉన్నాయో.. ఇదిగో ఇక్కడే నిల్చున్న మీ ఎమ్మెల్యే గారు గ్రంధి శ్రీనివాస్‌నే అడగాలి.. మీలో చైతన్యం రావాలి.. ఇలాంటోళ్లని నిలదీయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాలుక వీడియో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసి పారేస్తోంది. 

ఇది ఒక్కటే కాదు.. జగన్ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు.. ఇప్పటికీ తమ తమ నియోజకవర్గంలో పూర్తిగా పర్యటించిన దాఖలాలు అయితే లేవనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలోని కేడర్‌లో బలంగా ఉందని సమాచారం. నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో పర్యటించని ఎమ్మెల్యేలు.. ఇక ప్రజా సమస్యలు ఏమి తీరుస్తారంటూ ఓ ప్రశ్న కూడా ఆ పార్టీలోనే అంతర్గతంగా సాగుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం వైయస్ జగన్ పసిగట్టారని.. అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారని... ఈ కార్యక్రమానికి సైతం ఎమ్మెల్యేలు డుమ్మా కోడుతుండడం విశేషమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం.. ప్రతి నెల అప్పుల కోసం పడుతోన్న తిప్పలు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బాగా తెలుసునని..అందుకే ఈ విధంగా చురకలంటించి ఉంటారనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అదీకాక.. జగన్ ప్రభుత్వం రాష్ట్రా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా.. సంక్షేమ పథకాలపైనే మాత్రమే దృష్టి సారిస్తే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది అంత సలువు కాదంటూ ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ ఓ నివేదికను సైతం.. సాక్షాత్తూ జగన్ చేతిలో పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు.. కేటాయించిన నిధులను ఉపయోగించకుండా..  ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సందేహమే అనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయినా అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే ఇట్టే తెలిసిపోతోందని... అలాగే అధికార జగన్ పార్టీలోని ఎమ్మెల్యేలు పనిమంతులా? కాదా? అంటే.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస్ పనితనం చూస్తే చాలని ఓ చర్చ అయితే తాజా తాజాగా సోషల్ మీడియా సాక్షిగా రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.

By
en-us Political News

  
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.