Publish Date:May 23, 2023
వైబ్రెంట్ గుజరాత్ అంటూ భారీ ప్రచారంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి పదవికి ప్రమోషన్ పొందిన నరేంద్ర మోడీ.. ఇప్పటికీ భారత దేశానికి తాని తాను నిర్దేశిస్తున్న మోడల్ గుజరాత్ అనే చెబుతుంటారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని దాకా తన ప్రస్తానంలో సహకరించిన స్వరాష్ట్ర అధికారులు, నేతలనెవరినీ ఆయన మరచిపోలేదు.
దేశంలోని ఏ కీలక ప్రభుత్వ శాఖ, ఏ ప్రభుత్వ సంస్థ అధిపతులను తీసుకున్నా వారంతా గుజరాత్ కు చెందిన వారే అనడంలో సందేహాలకు తావివ్వని విధంగా మోడీ జాగ్రత్త పడ్డారు. ఇంతకీ అసలు ఆ వైబ్రెంట్ గుజరాత్ లో ఏం జరుగుతోంది. మోడీ ఎక్కడకు వెళ్లినా.. ఎందు కాలిడినా పొగిడేది గుజరాత్ ను గుజరాత్ సంస్కృతినే. ఇప్పటికీ ఆయన వ్యతిరేకులు మోడీ భారత ప్రధాని అయినా ఆయన తీరు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఉంటుందని ఎద్దేవా చేస్తుంటారు. అందుకు ఉదాహరణగా కేటాయింపుల్లోనూ, నియామకాల్లోనూ, బడ్జెట్ లోనూ గుజరాత్ కు ఆయన అగ్రతాంబూలం ఇవ్వడాన్ని ఎత్తి చూపుతుంటారు. మోడీ భారత్ కే మోడల్ గా చెబుతున్న గుజరాత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి మచ్చుతునకగా ఇటీవల ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ ఘోర ఉదంతాన్ని చెప్పుకోక తప్పదు.
మన దేశంలో సతీ సహగమనం దురాచారాన్ని 1829లో రద్దు చేశారు. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా గుర్తింపు పొందని రాజా రామ్ మోహన్ రాయ్ సతీ సహగమనానినికి వ్యతిరేకంగా చేసిన ఆందోళన ఫలించి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రద్దు చేశారు.
అయితే ఆ దురాచారం మళ్లీ గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల కిందట అంతరించిపోయిన సతీ సహగమనం ( భర్త చనిపోతే ఆ చితిపైనే ఆత్మాహుతి చేసుకోవడం) గుజరాత్ లో బలవంతంగా అమలు చేయబోతే ప్రతిఘటించీ ఫలితం లేని ఓ అబల శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. 28 ఏళ్ల ఓ హిందూ యువతి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. అత్తింటి వారు ఆమెను సతీసహగమనం చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. ఇంతకీ మోడీ చెబుతున్న న్యూ ఇండియా ఎటువైపు సాగుతున్నట్లు? మోడీ గుజరాత్ మోడల్ .. భారత దేశాన్ని ఏ నాగరికత వైపు తీసుకు వెడుతున్నట్లు?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/where-is-modi--new-india-going-25-155793.html
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది.నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది.
చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు.
ఎట్టకేలకు వల్లభనేని వంశీకి బెయిల్ దొరికింది ...140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది ...అయితే ఇప్పుడే వంశీని జైలు జీవితం విడిపోతుందా! లేక ఇంకేమైనా ఈ కథలో టెస్టులు ఉంటాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి
శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వైసీపీ అధినేత జగన్ రెడ్డి జైలు యాత్ర చేపట్టనున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు.
కర్నూల్ -విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు
పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి.
CM Chandrababu, Kuppam, Handreeniva, Srisailam, Kuppam Airport, YCP, CM Chandrababu, Naralokesh, TDP, Srisailam,