కొడాలి నాని ఎక్కడా?.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడా?

Publish Date:Apr 28, 2022

Advertisement

పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. కాదు.. ఫైర్ అంటూ హీరో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్.. దేశ ప్రజలను ఓ ఊపు ఊపిపారేసింది. ఎవరి నోట విన్నా.. ఇదే డైలాగ్.. ఈ డైలాగ్ అలా ఇలా కాదు.. పుష్పలో ఫైర్‌లాగా గట్టిగానే పేలింది. అయితే తాజాగా మాజీ మంత్రి అయిన కొడాలి నాని అంటే కూడా ముమ్మాటికి ఫైరే అని ఆయన ఫ్యాన్స్ గుడివాడ నియోజకవర్గంలో మరీ బల్లగుద్దీ చెబుతారు. మంత్రిగా కొడాలి నాని ఈ మూడేళ్లలో ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో కొడాలి నానిని.. ఒకానొక దశలో.. బూతుల సరఫరా శాఖ మంత్రి, బూతుల మంత్రి అని ట్యాగ్ ‌లైన్ కూడా తగిలించేశారీ ప్రజలు. అలాంటి ఫైర్..ఫైరింగ్ ఉన్న తమ నాయకుడు ప్రస్తుతం ఇలా సైలెంట్‌గా ఉండడం అటు గుడివాడ నియోజకవర్గ ప్రజలు.. ఇటు ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేక... వేసవి తాపంతో అల్లాడిపోతున్నట్లు..  అల్లాడిపోతున్నారు.
   
కొడాలి నాని కళ్లలో మళ్లీ ఫైరింగ్ చూడాలని వారంత వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవికీ రాజీనామా చేసే.. కొద్ది రోజుల ముందు కొడాలి నాని స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి.. మంత్రి పదవి తనకు లెక్క కాదని.. మంత్రి పదవి లేకుంటే.. తన విశ్వరూపం చూపిస్తానంటూ ఆయన క్లియర్ కట్‌గా చెప్పకనే చెప్పారు. ఈ మాటలతో.. కొడాలి నాని ఫ్యాన్స్.. ఓ రకంగా చెప్పాలంటే పండగే చేసుకొంది. కానీ మాజీ మంత్రి అయిన తర్వాత తమ ఆరాధ్య దైవం.. కొడాలి నాని విశ్వరూప విన్యాసం కోసం.. నియోజకవర్గంలో ఆయన ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చూస్తోంది. 

కొడాలి నానికి స్వతహాగా దూకుడు ఎక్కువా.. అలాంటి ఆయనకు మంత్రి పదవి దక్కడంతో.. ఆయన ఓ రెంజ్‌లో చెలరేగిపోయారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మూడేళ్లలో కొడాలి నాని.. ఏ ప్రెస్ మీట్ పెట్టి.. పైర్ అయినా..  ఫైరింగ్ అయినా.. సదరు ఫ్యాన్స్.. గుడివాడ పట్టణ రహదారులపై పెద్ద పండగా చేసుకున్నారనే ఓ టాక్ అయితే నాడే కాదు... నేడు కూడా హాట్‌హాట్‌గానే నడిచింది.. నడుస్తోంది. మంత్రి పదవిలో ఇంత హాడావుడి చేసిన తమ నాయకుడు ఇలా మౌన మునిలా ఉండడం చూసి వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తన జన్మదినం సందర్బంగా ఇటీవల మాజీ మంత్రి కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. దీనిపై కొడాలి నాని.. తనదైన శైలిలో స్పందిస్తారని ఆయన ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసింది. కానీ కొడాలి నాని స్పందించ లేదు. మరోవైపు తెలంగాణలోని నిజమాబాద్ నగరంలో.. ఓ సభలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని ఒరేయ్ అంటూ సంభోదిస్తూ.. ఆయనపై విమర్శలు చేశారు. 

అప్పుడన్నా కొడాలి నాని రంగంలోకి దిగి ఘాటుగా స్పందిస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశగా ఎదురూ చూసింది. కానీ కొడాలి నాని మాత్రం తన మౌన వ్రతాన్ని మాత్రం విడిందీ లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరుత్సాహాంలోకి సరున్న జారీపోయింది. తనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబును లైట్ తీసుకున్నా.. కొడాలి నాని ఇష్ట దైవం.. ఇంకా చెప్పాలంటే ప్రాణానికి ప్రాణమైన సీఎం వైయస్ జగన్‌పై రేణుకా చౌదరి విమర్శలను ఖండించకపోవడం పట్ల.. సదరు ఫ్యాన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా తమ అరాధ్య దైవం.. కొడాలి నాని తన విశ్వరూప విన్యాసం ప్రదర్శించాలని.. ఆయన ఫ్యాన్స్ మనసా వాచా కర్మణా కొరుకుంటున్నారు. అందుకోసం ఆయన ఫ్యాన్స్ వెయిటింగ్.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.