కొడాలి నాని ఏరీ? ఎక్కడ? ఆరోగ్యం ఏలా ఉంది?

Publish Date:May 15, 2025

Advertisement

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని  వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే  దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.   కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయవంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ  గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు   తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి విషయాలేవీ బయటకు తెలియడం లేదు. కొడాలి నాని సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన ఇంకా ముంబైలోనే ఉన్నారని అంటున్నారు. కానీ ఆపరేషన్ విజయవంతమైన తరువాత నెలల తరబడి ఆయన ముంబైలో  ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం బదులు లేదు. ఆయన మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే సమాధానం దొరకదు.  అయితే కొడాలి నాని మాత్రం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తెలుగుదేశం తనను టార్గెట్ చేయదని భావిస్తున్నట్లుగా ఉందని, రెడ్ బుక్ నుంచి తన పేరు తొలగించేస్తారని ఆశిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లు తనకు సేఫ్ కాదనీ, అందుకే ముంబైలోనే ఉండిపోయారనీ కూడా అంటున్నారు.  ఎందుకంటే కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి బెజవాడకు తరలించుకుపోయారు. దాదాపు వంద రోజులుగా వంశీ కటకటాలు లెక్కిస్తూనే ఉన్నారు. తనకూ ఆ గతే పడుతుందన్న భయంతోనే కొడాలి నాని తెలుగు రాష్ట్రాలవైపు కన్నెత్తి చూడకుండా ముంబైని షెల్టర్ జోన్ గా భావించి అక్కడే ఉండిపోయారని అంటున్నారు. వైసీపీ అధినేత బెంగళూరు  షెల్టర్ జోన్ గా భావించి చుట్టపు  చూపుగా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ నే ఆదర్శంగా తీసుకున్న కొడాలి నాని.. కనీసం చుట్టపు చూపుగానైనా ఏపీవైపు రావడం లేదని అంటున్నారు.   

By
en-us Political News

  
మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్‌ సన్‌ సైన్‌ ఆసుపత్రిలో హరీశ్‌రావు చేరారు
అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్న మాజీ మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన వందలాది మంది మన విధ్యార్ధులను మన విదేశాంగ శాఖ ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి, మన విధ్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది.
వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి పేర్నినానికి బిగ్ షాక్ తగిలింది. నూజీవీడు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఫార్ములా-ఈ కార్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు.
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కోసం ఉపయోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదే హెలికాప్టర్ ను రాష్ట్రపర్యటనలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ కోసం కేటాయించారు. ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు సోమవారం (జూన్ 16) హెలికాప్టర్ వినియోగించాల్సి ఉంది.
వైయస్సార్ కడప జిల్లాలో అరుదైన పుట్టగొడుగు కనిపించింది. పుట్టగొడుగులు మామూలుగా అయితే దాని బరువు 50 గ్రాములులేదా మహా అంటే వంద గ్రాముల లోపే ఉంటాయి.
2021 నవంబర్ 15వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో భారీ వాహనాలతో, ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్‌తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆపరేషన్ కగార్ కు నిరసనగా ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం అటవీ ప్రాంతాలలో మిలటరీ ఆపరేషన్ ద్వారా హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టింది.
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌‌కు జైలు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు ఉందని సీతక్క తెలిపారు.
భారత ప్రధాని మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ను ప్రధాని మోదీ అందుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.