ఏపీ రాజధాని ఎక్కడ? మళ్ళీ మొదటికొచ్చిన కథ..

Publish Date:Nov 22, 2021

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజదాని తేనే తుట్టెను మరో సారి కదిల్చారు. మూడు రాజధానులపై వెనకడుగు వేస్తున్న సంకేతాలిచ్చి... చివరకు ఎటూ తేల్చకుండా, ఏపీ రాజధాని ఏదీ అంటే దిక్కులు చూసే సందిగ్ధ పరిస్థితి సృష్టించారు. వికేంద్రీకరణ తప్పదని, అదొక్కటే రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రం అని పాత కథను మళ్ళీ వినిపించారు. అయితే మూడు రాజధానుల బిల్లును ఏ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను ఆశించిన జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏ ప్రయోజనం ఆశించి ముఖ్యమంత్రి మళ్ళీ అదే వికీద్రీకరణ  మంత్రం జపిస్తున్నారు. ఎందుకోసం వెనకడుగు తీసి ముందడుగు వేశారు ఇలా చాలా అనుమానాలు, అనేక ప్రశ్నలు రాజకీయ, మీడియా వర్గాల్లో  చర్చకు వస్తున్నాయి. 

అదలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును దానితో పాటుగా సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టిన శాసన సభా వ్యవాహాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పదే పదే శ్రీకృష్ణ కమిటి నివేదికను ప్రస్తావించారు. అమరావతి కంటే ప్రకాశం జిల్లా దొనకొండకు కమిషన్ ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని ఒకటికి సార్లు  ప్రస్తావించారు. అలాగే, వెనక బడిన ప్రాంతల అభివృద్ధిని రాజధానితో ముడి పెట్టి నేక్ ఉదాహరణలిచ్చారు. అమరావతి – దొనకొండ రెంటిలో దేన్నీ రాజధాని చేయాలి అంటే నా ఓటు దొనకొండకే అన్నట్లు మాట్లాడారు. బుగ్గన ప్రసంగాన్ని బిట్వీన్ ద లైన్స్ చదివితే, ప్రకాశం జిల్లా దొనకొండ – మార్టూర్ మధ్యన మరో శిలాఫలకం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 

అలాగే  దొనకొండను శివరామకృష్ణ  కమిటి ప్రిఫర్ చేయడమే కాకుండా, రాజధానికి అవసరమైన హంగులన్నీ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉంది. అలాగే, ప్రస్తుతం వినుకొండ నుంచి విజయవాడకు మరో రైలు మార్గం నిర్మాణంలో ఉంది.  అలాగే, కేంద్ర రైల్వే శాఖ, ఈ ప్రాంతం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని అంటున్నారు.అలాగే, బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎయిర్ పోర్ట్ ఒకటి సిద్డంగా ఉంది.. నాగార్జున సాగర్ నీరు పిలిస్తే పలికేందుకు రెడీగ ఉందని, ఈ అన్నిటినీ మించి దొనకొండ – మార్టూర్ మధ్యలో ప్రభుత్వ భూమే పుష్కలంగా ఉంది.. ఒక వేళ అంతో ఇంతో కొనవలసి వచ్చినా రాష్ట్రం మొత్తం మీద అత్యంత చౌకగా భూమి లభించేది ఇక్కడే..అంటున్నారు.అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ... ముఖ్యనేత ఒక్కరే,ఆప్రాంతంలో ఎప్పుడోనే ఏదో అలా పడుతుందని జస్ట్ ఓ 15 వేల ఎకరాలు భూమి  కొని పడేశారు. అలాగే, అస్మదీయులు కూడా ఎవరి శక్తి కొలది వారు ... 2014 కు ముందే పదులు లేదా వందల ఎకరాల్లో భూములు కొని పెట్టుకున్నారు..ట. సో.. బుగ్గన వ్యక్తపరిచిన అభిప్రాయాలను, అందుకు సప్లమెంట్’గా అధికార పార్టీ వర్గాల నుంచి దొనకొండకు జై కొడుతూ  వినవస్తున్న అనుకూల వాదనలను పరిగణలోకి తీసుకుంటే, అమరావతికి రెక్కలు రావడం, రాజధాని దొంకొండకు చేరడం ఇంచుమించుగా ఖరారు అయిందనే అంటున్నారు.       

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, శివరామకృష్ణ  కమిటి నివేదికను ప్రస్తావించడమే కాకుండా, ‘శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. అంతేకాదు,, అమరావతి ప్రాంతంలో  క‌నీస వ‌స‌తుల క‌ల్పనకే ల‌క్ష కోట్లు అవుతుంది. ఈ రోజు ల‌క్ష కోట్లు ప‌దేళ్లకు 6 ల‌క్షల కోట్లు అవుతుంది. గ‌త ప్రభుత్వ లెక్కల ప్రకార‌మే లక్షల కోట్లు క‌నీస వ‌స‌తుల‌కు వెచ్చించాల్సి ఉందని అన్నారు. అటు బుగ్గన ఇటు సీఎం మళ్ళీ మూలాలలోకి వెళ్ళడంతో, అసలు ప్రభుత్వం ఆలోచన ఏమిటి? రాజధాని ఇష్యూ ని మళ్ళీ హరికథ కాలక్షేపంలో ‘రెడ్డొచ్చె మొదలెట్టు’ అన్నట్లు, అమరావతి కథ మళ్ళీ మొదటికి వస్తుందా? అమరావతికి మొత్తానికే ఎసరు పెడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

మరోవంక ముఖ్యమంత్రి మొగ్గుచూపుతున్నవిశాఖపట్నం,విషయంలోనూ శ్రీ కృష్ణ కమిటి సానుకూలంగా నివేదిక ఇవ్వలేదని,  అమరావతిని కాదన్నట్లే విశాఖనూ వద్దందని నివేదిక లోతుగా  అధ్యయనం చేసిన నిపుణులు అంటున్నారు నిజానికి,శివరామకృష్ణ  కమిటి విశాఖ రాజధాని కాకుండా చూడవలసిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భుజస్కందాలపై ఉంచిందని, నిపుణులు అంటున్నారు. నిజానికి అదొక్కటే కాదు, స్థానిక ప్రజలు, ముఖ్యంగా  నగర జనాభాలో 60 శాతం వరకు ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు, వ్యాపార వర్గాలు విశాఖపట్నం రాజధాని అయితే, రాజకీయ ప్రభావం ఎక్కువ అవుతుంది భయపడుతున్నారు.అంతేకాకుండా, విశాఖలో ఉన్నకేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా, విశాఖను రాజధాని చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నిజానికి అప్పట్లోనే విశాఖ పోర్ట్ ట్రస్ట్ శివరామకృష్ణ  కమిటికి, విశాఖను రాజదానిగా సిఫార్సు చేయవద్దని లిఖిత్ పూర్వకంగా కోరింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ విషయంలో అంత సానుకూలంగా లేదని సమాచారం  సో.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆశించినా ఇంకొరు వద్దనుకున్నా విశాఖకు రాజధాని యోగం లేదు గాకలేదని లోగుట్టు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం. 
సో.. ఇటు అమరావతి అటు విశాఖ కాదనుకున్నప్పుడు..చివరాకు 2014కు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే, దొనకొండ రాజదాని అవుతుందని జరిగిన ప్రచారమే నిజమవుతుందని అంటున్నారు. రేపటి సంగతి ఎలా ఉన్నా.. ఈరోజు ఏపీ రాజధాని.. త్రిశంకు నగరమే..

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.