కొనుగోలు కేంద్రాలేవీ? అన్నదాతకు అండేదీ?

Publish Date:May 9, 2023

Advertisement

 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం  రైతులకు శాపంగా పరిణమించింది.

కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. పంట దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి నప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. 20 రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి కసరత్తు ప్రారంభించిన అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమైంది ఫలితంగా ఆరుగాలం శ్రమించి, అధిక వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేసిన వరి పంట మూడు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి కకావికలం అయింది. ఇటీవలి  అకాల వర్షాలకు పంటంతా నీట మునగగా, రైతన్నకు తీరని నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా  వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడాయి. కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టగా, ప్రసక్తే లేదని కేంద్రం పేర్కొనడంతో వరి పండించిన రైతుల్లో ఒకింత ఆందోళన మొదలయింది. గతేడాది ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కారు ప్రత్యక్ష ఆందోళనలకు దిగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెపం వెూపుకుంటూ కాలం వెళ్లదీశారు. పంట కోసే సమయం వరకు ప్రభుత్వం నుంచి సూచనలు రాకపోవడంతో అధికారులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. పంట కోతకు వచ్చే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని ఉంటే తమకు అకాల నష్టం జరిగి ఉండేది కాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ సంవత్సరం లక్షా 54వేల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. యాసంగి సీజన్‌లో ముందుగా సాగు చేసిన చోట దాదాపు నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం కాగా దిగుబడి అంచనాకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తీరా పంట కోసి ఆరబెట్టిన తరువాత అ కాల వర్షం కురిసి ధాన్యం మొత్తం తడిసిపోయింది. కొంత మొత్తం వరదలకు కొట్టుకొని పోయింది. అధికారులు సకాలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఉంటే పంటను అమ్ముకొనే వారమని రైతులు వాపోతున్నారు. ఈ యేడాది పంట ఏపుగా ఎదగడంతో దిగ బడి లాభసాటిగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా తమ ఆశలు వమ్మయ్యాయని లబోదిబో మంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.