Publish Date:Aug 16, 2025
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతను కూటమి పార్టీలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు అప్పగించాయి. దీంతో మోదీ, షాలు ఎవరిని ఖరారు చేస్తారన్నది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కడం లేదు. రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నా.. మోడీ షాల మదిలో ఎవరున్నారన్నది ప్రకటన వెలువడే వరకూ ఎవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ సస్పెన్స్ ఒక్క కూటమి పార్టీలలోనే కాదు కాంగ్రెస్ లో కూడా ఉంది. ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది తేలిన తరువాత కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని నిలబెట్టాలా? వద్దా? ఒక వేళ నిలబెడితే ఎవరిని అన్నది తేల్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 17) జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎవరన్నది తేలుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
అయితే పరిశీలకులు మాత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగుతుందనీ, అయితే అభ్యర్థి ఎంపిక బాధ్యత మాత్రం మళ్లీ మోడీ, షాలకు అప్పగిస్తుందనీ అంటున్నారు. ఇక మోడీ, షా ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సోమవారం (ఆగస్టు 18)న ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి దన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవిని చేసిన రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అన్న ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంత వరకూ జరగలేదు.
అయితే ఈ సస్పెన్స్ మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదు. ఉపరాష్ట్రపదవికి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ కావడంతో సోమ, లేదా మంగళవారం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్ని పేర్లు తెరమీదకు వచ్చినా ఫైనల్ గా అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే అనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/when-will-be-the-nda-vicepresident-candidate-finalisation-25-204376.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.