అవినీతికి  నీతి పాఠాలు చెప్పాలిప్పుడు!! 

Publish Date:Dec 20, 2021

Advertisement

ప్రస్తుత సమాజంలో ప్రతి పని కొన్ని నిర్ణీత షరతులకు లోబడి జరుగుతుంది. అయితే ఆ పనిని అదే షరతులతో జరపకుండా లేదా జరగనివ్వకుండా వక్ర మార్గంలో స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం ఇష్టమొచ్చినట్టు చేసే వాళ్ళు ప్రస్తుతం బోలెడు మంది ఉన్నారు. పేరుకే రాజ్యాంగం, అందులో చట్టాలు. వాటిని కచ్చితంగా పాటిస్తూ ఉన్నవాళ్లు ఏ కొద్దీ మందో. ఆ కొద్దీ మందిని తప్పిస్తే మిగినవాళ్ళు అందరూ తమంతకు తాము కొత్త నియమాలను సృష్టించినట్టు దౌర్జన్యంతో బతికేస్తుంటారు. చట్టంలో కొన్ని పనులను చేయకూడదు అనే నియమాలు ఉంటాయి.

కానీ వాటిని చేస్తూ ఆ చట్టాన్ని వెక్కిరించే ఉద్దండులు ఎందరో. ప్రస్తుత భారతదేశంలో అవినీతి వేళ్ళూనుకుపోయింది. ఎంతగా అంటే మాటల్లో చెప్పలేనంతగా. అన్ని రంగాలలో, అన్ని కార్యకలాపాలలో, అన్ని విధాలుగా ఈ అవినీతి జరుగుతూనే ఉంది, ముఖ్యంగా ఈ అవినీతి ఉక్కు పిడికిలిలో ఇరుక్కుపోయేది చిన్న స్థాయి, పేద, మధ్య తరగతి ప్రజలు. తమ జీవితాలకు, తాము పొందవలసిన ఎన్నింటినో అవినీతి మూలంగా కోల్పోతున్నారు. దీని వెనుక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాలు ఎన్నో ఉండచ్చు.

అర్హత కలిగిన పథకాలు పొందలేకపోవడం!!

సగటు మనిషికి ప్రభుత్వం కొన్ని పథకాలు నిర్దేశించింది. అవి ఆహార భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఇలా జీవితంలో సగటు మనిషికి అవసరమైనవి అన్నీ. కానీ ఇక్కడ రాజకీయ కోణాలు ప్రభావం చూపిస్తాయి. ఆ పథకానికి పౌరుడు అర్హుడా, కాదా అని విషయం కాకుండా పార్టీ, నాయకుడి కోణంలో వాటిని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా పౌరుడు నష్టపోతాడు.

లంచాల పరంపర!!

ప్రస్తుత కాలంలో లంచం ఒక సాధారణ విషయం అయిపోయింది. ఉద్యోగస్తుల బల్ల కింద, గోడల చాటున కరెన్సీ చేతులు మారడం పరిపాటి. మండల ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు వంటి చోట్ల ఈ లంచం లేకుండా పని జరగడం అంటూ ఉండదు. ఒకవేళ అది లేకుండా పని జరుగుతుంది అంటే అది ఏ రాజకీయ నాయకుడి రికమెండషనో అయి ఉంటుంది. ఇలా సాధారణ వ్యక్తి లంచాలు ఇచ్చుకుంటూనో, రాజకీయ నాయకుల దయాదక్షిణ్యాల వల్లనో బతుకుసాగిస్తూ ఉంటాడు. ఇది ఒక విషయం అయితే రెండోవైపు ఇంకో విషయం ఉంటుంది. అర్హత లేకపోయినా పలుకుబడితో, రాజకీయ అండతో సామాన్యులకు వెళ్లాల్సిన లబ్ధిని కాజేసేవారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు, పెన్షన్లు, ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాలు దోచేసేవాళ్ళు. అక్రమంగా స్థలాలు కబ్జా చేసి రాజకీయ అండతో పెత్తనం చేలాయించే వాళ్ళు. పేదవాళ్ళ కడుపు కొట్టి దోపిడీ చేసేవాళ్ళు. వాళ్ళను మోసం చేసేవాళ్ళు. 

ఇక విద్యార్థుల జీవితాలతో కులం పేరుతోనూ, రిజర్వేషన్ల పేరుతోనూ పై స్థాయి చదువులు చదవలేక పోతున్నవాళ్ళు. అధికారుల సంతకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నవాళ్లు. స్కాలర్షిప్పులు, రియింబర్స్మెంట్ లు రావడానికి చేతులు తడపాల్సిన  పరిస్థితిలో ఉన్నవాళ్లు. ప్రతిభ ఏమీ లేకున్నా ప్రభా పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందేవాళ్ళు. వీటి వల్ల నిజమైన ప్రతిభ ఉన్నవారు ఎందరో నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇదంతా సాధారణ అవినీతి అయితే రాష్ట్రాలు, దేశాల మధ్య దొంగ రవాణా, స్మగ్లింగ్, దొంగ నోట్లు, సైబర్ నేరాలు, డబ్బు అడ్డు పెట్టుకుని ఘోరమైన తప్పులకు శిక్షలు తప్పించించజకునే మహానుభావులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ  కూడా సగటు సాధారణ పౌరుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

కానీ సిగ్గు పడాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఈ అవినీతి కార్యకలాపాలను చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుంది. అందుకే సగటు పౌరుడు అవినీతికి వ్యరేకంగా మాట్లాడినా ఆ పౌరుడే మళ్ళీ శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి అవినీతి అనేది పైనేక్కడో పెద్ద పెద్ద వేర్లతో విస్తరించుకుంది. అది కూకటివేర్లతో సహా పెకించుకుని నేల కూలిపోవాలి. కనీసం రేపటి పౌరులను అయినా అవినీతికి వ్యతిరేకంగా పెంచితే రేపటి భారతంలో కాసింత నీతిమాలిన జీవితాలు కనబడతాయేమో. అందుకే అవినీతికి నీతి పాఠాలు చెప్పాలి!! 

◆ వెంకటేష్ పువ్వాడ

 

By
en-us Political News

  
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.