విజ‌య‌సాయిరెడ్డి నిజంగా పార్టీ పెడితే?

Publish Date:Nov 23, 2025

Advertisement

విజ‌య‌సాయిరెడ్డి పార్టీ- పార్టీ- పార్టీ.. అంటూ మూడు ర‌కాల పార్టీ రిలేటెడ్ కామెంట్స్ చేశారు. మొద‌ట పార్టీ కామెంట్ విష‌యానికి వ‌స్తే తాను ప్ర‌స్తుతం ఏ  పార్టీలో లేనన్న క్లారిటీ ఇచ్చిన ఆయన తాను ఇప్పుడు కేవ‌లం వ్య‌వ‌సాయం  చేసుకుంటోన్న రైతును మాత్ర‌మేన‌ని స్పష్టం చేశారు.  అక్కడితో ఆగకుండా తాను ఏ  పార్టీలోనూ చేర‌డం  లేద‌నీ చెప్పారు. ఇక ముచ్చ‌ట‌గా మూడోది తాను అవ‌స‌ర‌మైతే సొంతంగా ఒక పార్టీ పెడ‌తాన‌న్నారు 

ఆయన ఇవే విషయాలు గతంలోనూ చెప్పారు. అయితే ఇప్పుడు.. అవును ఇప్పుడే ఆయన మళ్లీ ఈ కామెంట్లు ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది.  ఇంతకీ ఆయన ఇప్పుడు ఈ కామెంట్లు చేయడానికి ఆయన  బీజేపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సోషల్ మీడియాలో ఆయన లక్ష్యంగా పెద్ద ఎత్తున నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. అందుకే తాను ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.  త‌న‌పై  ఒత్తిళ్లు చాలానే ఉన్నాయనీ,  అయినా స‌రే త‌న‌కు ఏ రాజ‌కీయ పార్టీలో నూ చేరాల‌న్న త‌లంపు కూడా లేదనీ మరో సారి కుండబద్దలు కొట్టేశారు

విజయసాయి.   గ‌త 20 ఏళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప్ర‌త్యేక సంబంధ బాంధ‌వ్యాలున్నాయ‌ని అంటూనే, జనసేన నుంచి పార్టీలో చేరాల్సిందిగా  ఒత్తిడి ఉందన్న అర్ధం వచ్చేలా మాట్లాడుతూనే, అదే సమయంలో తాను ఆ పార్టీలో చేరబోవడం లేదన్న క్లారిటీ ఇచ్చారు. నిజానికి విజ‌య‌సాయిరెడ్డికి బాల‌కృష్ణ‌తో కావ‌చ్చు, టీడీపీకి సంబంధించిన కుటుంబాల‌తో కావ‌చ్చు బంధుత్వాలున్నాయి. అనుబంధం ఉంది, కానీ, ఆ రిలేష‌న్స్ ని క్రాస్ చేసి ఆయ‌న ఎప్పుడూ ఇంత వ‌ర‌కూ రాజ‌కీయాలు చేయ‌లేదు. కాబ‌ట్టి జ‌న‌సేన విష‌యంలోనూ ఇదే  జ‌రుగుతుంద‌నుకోవ‌చ్చ‌.

ఇక అవ‌స‌ర‌మైతే పార్టీ పెడ‌తానంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.   విజ‌య‌సాయిరెడ్డి   వైసీపీకి రిజైన్ చేసేట‌పుడు కూడా  మీడియా చానెల్ పెడ‌తాన‌న్నారు.  ఇంత వరకూ ఆ ఊసే లేదు.  ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా సొంతంగా రాజకీయపార్టీ పెట్టడం కూడా జరిగే పని కాదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే   గత ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు, అప్పుడు గెలిచి ఉంటే విజయసాయి రెడ్డి సొంత పార్టీ మాటను కొందరైనా నమ్మేందుకు అవకాశం ఉండేది. కానీ నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయిన విజయసాయి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టినా, అది బీహార్ లో సొంత పార్టీ పెట్టి పీకే చూపినంత ప్రభావం కూడా ఏపీ రాజకీయాలలో చేపే అవకాశం ఉండదని అంటున్నారు.  

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.