Publish Date:Jan 25, 2025
విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన.. ఇక తన భవిష్యత్ వ్యాపకం వ్యవసాయమే అంటూ చేసిన రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అయితే పూర్తిగా డీలా పడిపోయింది. జగన్ పై పార్టీలో విశ్వాసరాహిత్యం పెచ్చరిల్లిందనడానికి విజయసారి రాజీనామాయే ఉదాహరణ అని పరిశీలకులు అంటున్నారు.
తన రాజీనామా విషయంలో విజయసాయి ఎంత చెప్పినా, ఎంతగా తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నా, వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని ఎంతగా నమ్మబలికినా ఎవరూ నమ్మడం లేదు. ఎవరిదాకానో ఎందుకు వైసీపీ వర్గాలే ఆయన మాటలను విశ్వసించడం లేదు. జగన్ కు పట్ల అంత విధేయత ఉంటే.. కనీసం ఆయన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకైనా రాజీనామా ప్రకటన చేయకుండా ఉండాలి కదా అంటున్నారు.
వాస్తవానికి విజయసాయి రాజీనామా ప్రకటన కంటే.. ఆ ప్రకటన ఆయన చేయడానికి ఎంచుకున్న సమయం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీ శ్రేణులకు పార్టీకి ఇక భవిష్యత్ లేదన్న సంకేతాన్ని పంపించిందనడంలో సందేహం లేదు. అన్నీ జగన్ కు చెప్పాను, ఆ తరువాతే రాజీనామా నిర్ణయం ప్రకటించాను అని విజయసాయిరెడ్డి చెప్పుకున్నా.. పార్టీలో ఎవరూ నమ్మడం లేదు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో విజయసాయి తన రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేయడం పార్టీ నేతలు, కేడర్ ను షాక్ కు గురి చేసింది. ఇంతటి కీలక నిర్ణయాన్ని విజయసాయి జగన్ ఆబ్సెన్స్ లో ఆయనతో చర్చించకుండా తీసుకోవడం నిజంగా అందరినీ షాక్ కు గురి చేసింది. అదును చూసి దెబ్బకొట్టాడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది.
ఒక వేళ విజయసాయి తాను చెబుతున్నట్లుగా జగన్ తో తన రాజీనామా విషయం చర్చించి ఉంటే కచ్చితంగా ఆయన వద్దని వారించేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం తాను విదేశీ పర్యటన నుంచి వచ్చే వరకైనా రాజీనామా నిర్ణయం ప్రకటనను ఆపేవారని చెబుతున్నారు. అది జరగలేదంటే విజయసాయి తన నిర్ణయాన్ని జగన్ కు సూచన ప్రాయంగానైనా తెలియజేయలేదనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలా జగన్ కు కూడా చెప్పాపెట్టకుండా విజయసాయి రాజీనామా చేశారంటే..విజయసాయి ఏ స్థాయి ఒత్తిడిలో ఉన్నారో అవగతమౌతుంది. కేసులు, అరెస్టు నుంచి తనను తాను కాపాడుకోవడానికే విజయసాయి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-threatened-vijayasai-39-191837.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.