రంజాన్ మాసంలో ఏ పనులు చేయాలి?  ఏ పనులు చేయకూడదు?

Publish Date:Feb 20, 2026

Advertisement

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు. భారతదేశంలో ఉపవాసం సాధారణంగా మరుసటి రోజు ప్రారంభమవుతుంది. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల.  దీనిని అత్యంత పవిత్రమైన మాసంగా  పరిగణిస్తారు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది.  ఈ సమయంలోనే పవిత్ర ఖురాన్ అవతరణ ప్రారంభమైందని చెబుతారు. రంజాన్ ఉపవాసం,  దాహం గురించి మాత్రమే కాదు, రంజాన్ మాసంలో చెయవలసిన పనులు,  చేయకూడని పనులు కూడా ఉంటాయి.  అవేంటో తెలుసుకుంటే..

రంజాన్ ప్రాముఖ్యత..

రంజాన్ మాసం దయ, ఆశీర్వాదం,  క్షమాపణల మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముస్లింలు ఉపవాసం ఉండి, తమ పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. ఉపవాసం సహనం, క్రమశిక్షణ,  స్వీయ నియంత్రణను నేర్పుతుంది. రోజంతా ఆకలితో,  దాహంతో ఉండటం వల్ల పేదవారి కష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనుషులలో స్పందించే గుణం పెరుగుతుంది.

రంజాన్ నెలలో జకాత్,  సదఖా (దానధర్మాలు) ఇవ్వడం  చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. పేదలకు  ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం సమాజంలో సమానత్వాన్ని,  సోదరభావాన్ని పెంపొందిస్తుంది.  రంజాన్ చివరి పది రాత్రులు ప్రత్యేకంగా పరిగణించబడతాయి. షబ్-ఎ-ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది.

రంజాన్ మాసంలో ఏం చెయ్యాలి..

ఐదుసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు.  అది కూడా  సరైన సమయానికి చేయాలి.


ప్రతిరోజూ ఖురాన్‌లో కొంత భాగం చదవడం లేదా వినడం చేయాలి. ఈ నెల ఖురాన్‌తో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయం.

ఖర్జూరం,  నీటితో ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది.


జకాత్,  సదఖా ఇవ్వడం ద్వారా పేదవారికి సహాయం చేయాలి.

 ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కోపం, వాదనలు,  కఠినమైన మాటలు నివారించాలి.

ఇఫ్తార్ సమయంలో  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,  సమతుల్య భోజనం తినాలి.

రంజాన్ లో చేయకూడనివి..

అబద్ధాలు చెప్పడం, గాసిప్ చెప్పడం,  ఇతరులను   బాధపెట్టడం మానుకోవాలి.

చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదు.

ఇఫ్తార్ సమయంలో ఆహారం వృధా చేయకూడదు.  లేదా వృధా ఖర్చులు చేయకూడదు.

ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకూడదు.

పనికిరాని కార్యకలాపాలలో లేదా చెడు అలవాట్లలో సమయాన్ని వృధా చేయకూడదు.

                                                    *రూపశ్రీ

By
en-us Political News

  
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.