పేటీఎం వర్మా నీ రేటెంత.. సోషల్ మీడియాలో దుమ్ముదుమారం!

Publish Date:Jun 25, 2023

Advertisement

సోషల్ మీడియా విస్తృతం అయ్యాక సెలబ్రిటీలు దాన్నే వ్యాపారంగా మలచుకొని కాసులు పోగేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలనే తీసుకుంటే వీళ్ళు ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు రూ.కోట్లలోనే వసూలు చేస్తారు. వ్యాపార సంస్థలు వారి ప్రోడక్ట్స్ సేల్ చేసుకొనేందుకు వీరిని ఉపయోగించుకుంటారు. వ్యాపారసంస్థలు ఈ సెలబ్రిటీలకు ఇన్‌ఫ్లూయెన్షర్లు అని పేరు కూడా ఒకటి పెట్టుకున్నారు. ఈ ఇన్‌ఫ్లూయెన్షర్లు వ్యాపార సంస్థల నుంచి డబ్బు తీసుకుని వారి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన ఆయుధం సోషల్ మీడియానే. ఇందులో ఎంత ఫాలోయింగ్ ఉంటే అంత డబ్బు ఈ సెలబ్రిటీల సొంతం అవుతుంది. దీనిని వ్యాపార భాషలో చెప్పాలంటే డిజిటల్ మార్కెట్ అని కూడా అంటుంటారు. 

అలాగే, అదే సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు కూడా తమదైన శైలిలో వాడుకుంటుంటాయి. తమకి గిట్టని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా బురదజల్లే పని చేస్తుంటాయి. దీని కోసం ఏ పార్టీకి ఆ పార్టీ డిజిటల్ విభాగాలను సైతం ఏర్పాటు చేసుకొని భారీగానే ఖర్చు చేస్తుంటుంది. ఈ డిజిటల్ విభాగాలు భారీగా నిరుద్యోగ యువతను రిక్రూట్ చేసుకొని వారితో ఈ యాక్టివిటీలను చేయించడంతో పాటు నెటిజన్లతో కూడా రాజకీయాలు, పార్టీలు, నేతల వ్యక్తిగత జీవితాలపై కూడా పోస్టులు, కామెంట్లు చేయిస్తూ ఒక్కో పోస్టుకు ఇంత అని డబ్బులు ముట్టజెప్తుంటాయి. మొదట్లో ఈ లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారానే జరిగేది. ఇప్పుడు రకరకాల మార్గాల ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. 

కాగా, టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం అనే సినిమా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యధావిధిగా ఈ టీజర్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబును నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యేవరకు జరిగిన కథతో తెరకెక్కిన సినిమాగా చెప్పుకుంటున్న ఈ సినిమా కథలో చంద్రబాబే అంతా చేయించాడనే మాదిరి టీజర్ ద్వారా ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ టీజర్ తోనే ఈ సినిమా భవిష్యత్ తేలిపోయింది. అయితే, ఈ టీజర్ చూసిన టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు వర్మపై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. నిజానికి వాస్తవ కథ పేరుతో వైసీపీ స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కించడం ఆయనను ఇష్టపడే వారికి సైతం వెగటుగా మారింది. ఇక టీడీపీ ఫాలోవర్లయితే సోషల్ మీడియాలో విమర్శలతో దుమ్ము  రేపుతున్నారు.

వర్మ సినిమాలను ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం కూడా మానేయడంతో బార్లు, పబ్బుల ఖర్చుల కోసం తన టాలెంట్ ను జగన్మోహన్ రెడ్డికి అమ్మేసుకున్నాడని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము కాదు టాలెంటు అంటూనే వైసీపీ కోసం ఇంతకి దిగజారి పోయావా వర్మా అంటూ ఏకి పారేస్తున్నారు. నీ రేటెంతో చెప్పు పేటీఎం వర్మా.. ఒక్క రూపాయి ఎక్కువే ఇస్తాం అసలు నిజాలు బయటపెట్టు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ కి పోస్టుకి రూ.5 ఇస్తే.. నీకు రూ.10 ఇచ్చారా వర్మా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఒక్క టీజర్ కే ఇంతలా ఈ యుద్ధం మొదలైతే.. రేపు ట్రైలర్.. ఆ తర్వాత సినిమాపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందో.. ఇంకెన్ని కామెంట్లు చదవాల్సి వస్తుందో!

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.