Publish Date:Aug 14, 2022
పొరపాట్లు చేసినా మంచివారిని కాపాడలనుకుంటారు. దొంగల్ని, అత్యాచారాలు చేసేవారిని, మహిళలతో అసభ్యంగా వ్యవహ రించే వారిని రక్షించాలనీ అనుకోరు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం తమ ఎంపీ గోరంట్ల భాగోతం లోకమంతా తెలిసినా ఇంకా ఏదో దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు రావాలి.. అంటూ తాత్సారం చేస్తూ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నది. హత్య చేసిన ఎమ్మెల్సీ ని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ ని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 90 రోజులలోపు ఛార్జ్ షీట్ వేయకుండా ఎమ్మెల్సీ అనంత బాబు కు పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు చేస్తున్న కుట్ర వెనక ఎవరు న్నార న్నారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో అనంతపురం ఎస్పీ పకీరప్ప ఎటువంటి విచారణ లేకుండా ఫేక్ వీడియో అంటూ తేల్చారని రామకృష్ణ మండిపడ్డారు. మనిషిని చంపి, కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుపై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ? అని ప్రశ్నించారు. అనంతబాబు కేసులో పోలీసు, ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమి స్తామని రామ కృష్ణ స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా, అశ్లీల వీడియో కాల్ ఆరోపణలు ఎదుర్కొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఢిల్లీ నుంచి వస్తున్న నేపథ్యం లో అనంతపురంలో కాస్త గందరగోళం నెలకొంది. ఆరోపణలు నిరాధారమైనవని పోలీసులు తేల్చడంతో సొంత జిల్లాకి వస్తున్న ఎంపీకి భారీగా ఆహ్వానం పలికేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఆంధ్రా బార్డర్ నుంచి అనంతపురం వరకు వెహికల్స్‌తో ర్యాలీ చేపట్టేందుకు గోరంట్ల అభిమానులు సిద్ధమయ్యారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా అనంతపురంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా టీడీపీ నాయకు లను పోలీసులు ముందస్తు అరెస్టుల చేశారు.
గోరంట్లకు వ్యతిరేకంగా చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు అందించారు. అతనితో పాటు అనంతపురం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి రమణకు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత లక్ష్మీ నరసింహను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే గఫూర్ మండిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-your-interest-in-gorantla-asks-cpi-ramakrishna-25-141902.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.