ఇదేమిటబ్బా..!

Publish Date:Nov 14, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్టోబర్ 11న అంటే శనివారం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.  గత వారం రోజులుగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో విశాఖపట్నంలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడం.. అందులోభాగంగా.. మెరుగైన వైద్య చికిత్స కోసం.. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలించాలని సదరు ఆసుపత్రి వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని భాగ్యనగరానికి తరలించారు. కానీ ఇక్కడే వచ్చి పడింది అసలు చిక్కంతా అనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. 

జగన్ గద్దెనెక్కిన తర్వాత.. మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకు వచ్చారు. ఆ క్రమంలో విశాఖపట్నం రేపోమాపో రాజధానిగా కొలువు తీరనుందని.. అలాంటి రాజధాని నగరంలో విద్య, వైద్యం, రవాణా తదితర సౌకర్యాలన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలని.. కానీ విశాఖపట్నంలో మెరుగైన వైద్యం లేదంటూ బొత్సకు వైద్య పరీక్షల నిర్వహించిన వైద్యుల  ద్వారా అవగతమవుతోందని.. అందుకే ఆయనను పక్కా రాష్ట్రం హైదరాబాద్ తరలించారనే విషయం స్పష్టమవుతోందనే ఓ చర్చ జోరందుకుంది. 

ఇక రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్  కార్యక్రమం, జగనన్న ఆరోగ్య సురక్షా పథకం అమల్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. జగన్ పాలనలో అన్ని రంగాంల్లో రాష్ట్రం దూసుకు పోతున్నదని వైసీపీ మాజీలు, తాజా మంత్రులే కాదు.. ఆ పార్టీలోని కీలక నాయకులు సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు మీడియా ముందుకు వచ్చి ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. మరి విశాఖపట్నంలో వైద్య సేవలు అంత బావుంటే.. మంత్రివర్యులు ప్లస్ ఉత్తరాంధ్ర కింగ్ బొత్స ఇలా హైదరాబాద్‌కు వెళ్లి ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందనే  ప్రశ్న సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నెటిజనులు బోత్స సత్యనారాయణతో పాటు జగన్ సర్కార్ ను కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 
 
గతంలో కరోనా సమయంలో సైతం జగన్ కేబినెట్‌లోని పలువురు మంత్రులు వారి కుటుంబాలు   హైదరాబాద్ తరలి వెళ్లి ఆక్కడ కరోనా చికిత్స తీసుకున్నాయి.. ఇంకా  స్పష్టంగా చెప్పాలంటే.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును..  హైదరాబాద్  కు ఎయిర్ లిఫ్ట్  చేసి మరీ వైద్యం అందించారని.. అంత దాకా ఎందుకు ఇటీవల మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారండతో.. ఆయన్ని బొంబాయి తరలించారని.. నెటిజనులు గుర్తు చేస్తున్నారు.
   
అయినా రేపోమాపో విశాఖ రాజధాని కానుందని వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు విశాఖ కేంద్రంగా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదనే సందేహాలు   పోలిటికల్ సర్కిల్‌లో  వ్యక్తమౌతున్నాయి.

మరోవైపు విశాఖపట్నానికి ప్రస్తుతం ఇన్‌చార్జి మంత్రిగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ఉన్నారని.. మరి బోత్స వ్యవహారంపై ఓ బాధ్యత కలిగిన ఆదే శాఖకు చెందిన మంత్రిగా..  ఆమె ఏం సమాధానం చెబుతారని నెటిజనులు నిలదీస్తున్నారు.

ఇంకో వైపు కరోనా సమయంలో.. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ గుర్తున్నాయనీ, ఇంకా వివరంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని కరోనా బాధితులు   చికిత్స కోసం తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశారని.. కానీ  అక్కడి కేసీఆర్ ప్రభుత్వం వారిని తెలంగాణ భూభాగంలో అడుగు పెట్టనివ్వలేదని.. అలాంటి సంఘటనల జరిగిన దృష్ట్యా.. మనం, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కాకుంటే.. కనీసం వైద్య ఆరోగ్య రంగంలో అయినా గణనీయ ప్రగతి సాధించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది అనారోగ్య జీవులు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు తీసే పరిస్థితి ఉండేది కాదు కదా అంటున్నారు. ఈ కనీస  అవగాహన  వైసీపీ సర్కార్ కు, ఆ ప్రభుత్వంలోని మంత్రులకు  లేక పోవడం నిజంగా సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏదీ ఏమైనా.. రాష్ట్రంలో అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం  రకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రముఖ ఆసుపత్రులు ఉన్నాయని.. వాటిని విస్మరించి.. ప్రజాప్రతినిధులు ఇలా పక్క రాష్ట్రం హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవడంతో.. ఆ తర్వాత ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పువ్వాడ అజేయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ఆ రాష్ట్ర అభివృద్ధిపై వివిధ సభల్లో వెటకారం,  హేళనగా మాట్లాడడం.. వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో మళ్లీ జగన్ కేబినేట్‌లోని బొత్స లాంటి వారు.. ప్రెస్ మీట్ పెట్టి  కౌంటర్ ఇవ్వడం రివాజుగా మారిపోయిందని.. అయినా బొత్సలాంటి వారు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లడం వంటి సంఘటనలు చూస్తుంటే ఏపీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలలో తప్పేముందని అనిపించక మానదని పరిశీలకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
పార్లమెంట్‌లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.