ఇదేమి స్నేహం ఇదేమి బంధం !

Publish Date:Jan 16, 2023

Advertisement

పెళ్ళయితే అయింది కానీ, కలిసి కాపురం చేసింది లేదు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కథ కుడా అలాగే సాగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి మూడేళ్ళు దాటింది. కానీ, ఇంతవరకు కలిసి కూర్చున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఉమ్మడి పోరాటాలు, ఆందోళనలు అసలే లేవు. నిజానికి, గడచిన మూడేళ్ళ పై చిలుకు కాలంలో  బీజేపీ, జనసేన నాయకులు ఏ స్థాయిలోనూ ఒక్కటంటే ఒక్క ఉమ్మడి కార్యక్రమం నిర్వహించ లేదు. చివరకు, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలోనూ, రెండు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయలేదు. కార్యకర్తల మధ్య సయోధ్య  కనిపించలేదు. 

మరోవంక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా  సహా ఇతర బీజేపీ జాతీయ నాయకులు ఏపీకి  వచ్చి పోతున్నా, మిత్ర పక్షం జనసేన నాయకులను కలిసింది లేదు, వారితో మాట్లాడింది లేదు.కొద్ది నెలల క్రితం బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో జనసేన  నాయకులు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలనికోరారు. ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. అయినా  నడ్డా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా ప్రకటించకపోవడమే కాదు, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి గంటకు పైగా చేసిన ప్రసంగంలో కనీసం పవన్ కళ్యాణ్ పేరైనా ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్  ఎప్పుడో సంవత్సరం  క్రితమో ఏమో రోడ్ మ్యాప్ అడిగారు. బీజేపీ స్పందించలేదు. మరోవంక జనసేన ఎక్కడా బీజేపీని మిత్ర పక్షంగా గుర్తించిన దాఖాలు లేవు. కేవలం టీవీ చర్చల్లో చెప్పుకోవడమే కానీ, క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేసింది లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు.  

బీజేపీ అగ్ర నేతల మనసులో ఏముందో ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియదు. మరో వంక ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. నాయకులు లేరు. ఉన్న గుప్పెడు మంది నాయకుల మధ్య సయోధ్య లేదు. కొందరు వైసీపీ కొమ్ముకాస్తే మరి కొందరు టీడీపీ కొమ్ము కాస్తారు. అందుకే, పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు ఇక చాలను కున్నారో, ఏమో కానీ, టీడీపీతో కలిసి వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రెండవసారి స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ రెండున్నర గంటల పాటు వన్ టూ వన్ భేటీ జరిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పోరాటం చేస్తామని మీడియా ఎదుట ప్రకటించారు. చాలా స్పష్టంగా వైసీపీని ఓడించే లక్ష్యంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పారు. నిజానికి ఏపీలో ఓటంటూ ఉందంటే, వైసీపీ, టీడీపీలకు,జనసేన పార్టీలకే వుంది. మిగిలిన పార్టీలకు ఒకటి రెండు శాతం ఓటు కూడాలేదు. సో, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చుస్తానని చెప్పడం టీడీపీతో పొత్తుకు సిద్దమని ప్రకటించడంతో సమానమని వేరే చెప్పనక్కర లేదు. 
అయితే, ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం పవన్ మా మిత్రుడే అంటోంది. పైగా జస్ట్ అలా పవన్ వెళ్ళి చంద్రబాబుని కలిశారంతే అని చెబుతోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అయితే బీజేపీ జనసేన బంధం కొనసాగుతుంది అని నమ్మ బలుకుతున్నారు.ఏపీలో మా రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంది అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు కలిశారు అంటే కలవడంలో తప్పు లేదు కదా అంటున్నారు.

పైగా అంశాల వారీగా రెండు పార్టీల మధ్య అవగాహన కావచ్చు అని కొత్త బంధాన్ని తెర మీదకు తెచ్చారు. నిజమే, బీజేపీ రాష్ట్ర నాయకులకు కేంద్ర నాయకత్వం మనసులో ఏముందో తెలియదు. అందుకే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇలా ... తలాతోకా  లేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. మరో వంక జనసేన  బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.చివరకు సామాన్య ప్రజలు కూడా పెళ్లి చేసుకున్నతర్వాత చేస్తే పద్దతిగా సంసారం  చేయాలి, లేదంటే విడాకులు తీసుకోవాలి .. అంతే కానీ, అటూ ఇటూ కాకుండా ఉంటామంటే ఎలా? ఇదేమీ స్నేహం ? ఇఎమి బంధం ? అని నవ్వుకుంటున్నారు.

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.