మంత్రిగా ఉంటూ ఈ చిల్లర చేష్టలేంటి రోజా మేడమ్?

Publish Date:Oct 18, 2022

Advertisement

‘వేసిన రాయినల్లా ఒప్పుకుంటే.. వెర్రోడే గెలిచాడని’ సామెత ఒకటి ఉంది. అంటే.. ఆ మాదిరిగా ఉంది ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తీరు అని పలువురు రాజకీయ నేతలు, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.  విశాఖపట్నం విమానాశ్రయంలో రోజా ప్రవర్తించిన తీరుతో అనేక మంది ఆమెపై  అగ్గిమిద గుగ్గిలం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తున్న సందర్భంగా ఆయనకు అఖండ స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన శ్రేణులు, నేతలను రెచ్చగొట్టే విధంగా మంత్రి రోజా ‘వేలు’ చూపించడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. మంత్రై ఉండీ అలాంటి చిల్లర చేష్టలేమిటని ప్రశ్నిస్తున్నారు.

అమరావతే ఏకైక రాజధాని అన్న  డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న క్రమంలో ‘విశాఖ గర్జన’ పేరుతో అధికార వైసీపీ ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో శనివారం (అక్టోబర్ 15) జరిగిన కార్యక్రమంలో ఆ గర్జనలో మంత్రి రోజాతో సహా పలువురు ఇతర మంత్రుల, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను అమరావతి రైతులపై రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత తిరిగి వెళ్లేందుకు రోజా సహా వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.

అదే సమయంలో ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన కోసం, ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించేందుకు వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను స్వాగతించేందుకు జనసేన నేతలు, శ్రేణులు ఇసుక వేస్తే రాలనంత సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ సందర్భంగా ఎయిర్ పోర్టు ఆవరణలో రోజా తన వేలు చూపిస్తూ వారిని రెచ్చగొట్టారు. దాంతో జనసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం.. మంత్రులకు, వైసీపీకీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మంత్రుల కార్లపై దాడి జరిగింది.

మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చేటపుడు తాను అక్కడే ఉన్నానని, జనసేన నేతలు, కార్యకర్తలు హుందాగా వ్యవహరించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జనసైనికులకు మంత్రి రోజా వేలు చూపించారు. వేలు చూపించడానికి అర్థం ఏమిటో రోజాయే చెప్పాలి అని బుద్దా వెంకన్న అన్నారు. ఇటు జనసైనికులు కూడా రోజా వ్యవహరించిన తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రోజా మరీ  హద్దుమీరి  వ్యవహరిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. రోజా వేలు చూపించిన వీడియో క్లిప్పింగ్ చూసిన పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఓ మహిళ అయి ఉండీ, పైగా మంత్రి పదవిలో ఉండీ ఆమె అటువంటి చేష్టలకు పాల్పడటాన్ని తప్పుపడుతున్నారు.  

రోజా ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని జనం గుర్తుచేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. అప్పటి మంత్రి పీతల సుజాతపైన కూడా ‘వడ్డాణం’ అంటూ ఆమె ప్రదర్శించిన హావభావాలు చూసిన ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. అలాగే అసెంబ్లీలోనే  టీడీపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి వైపు చూస్తూ  ‘… కోస్తా’ అంటూ ఆమె చేసిన విన్యాసం కూడా పలువురిని విస్మయా నికి గురిచేసింది.   మంత్రి పదవి  చేపట్టిన తరువాత  అయినా హుందాగా ప్రవర్తించకుండా ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతుండాన్ని జనం అసహ్యించుకుంటున్నారు. రోజాకు ఇప్పటికైనా కాస్త ఇంగితం వస్తే బాగుండు అని వ్యాఖ్యానిస్తున్నారు.

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.