కేసీఆర్ తాజా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోజనం ఏమిటి? ఫలితమేమిటి?

Publish Date:Oct 25, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ముందు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. ఆయన ఆపరేషన్ కు ఆకర్షితులై పార్టీలోకి వలస వస్తున్న వారంతా కూడా తెరాసను ఏదో కారణంతో వీడి వెళ్లిన వారే కావడం గమనార్హం.

దీంతో ఆయన తాజాగే ప్రారంభించిన ఈ ‘ఆపరేషన్’ ఫలితమేమిటి, తెరాసకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి వినవస్తున్నాయి. గతానికి భిన్నంగా కేసీఆర్ స్వయంగా ఫోన్ లు చేసి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

దీని వెనుక కేసీఆర్ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటే.. భవిష్యత్ లో ఏదో ఒక పదవి గ్యారంటీ అన్న ఆశతోనైనా పార్టీలోకి వలస వస్తారన్నది ఆ వ్యూహంగా పరిశీలకులు  అంటున్నారు.  ఎందుకంటే కేసీఆర్ పిలుపునకు స్పందించి తెరాస గూటికి చేరిన వారంతా గతంలో పార్టీలో ప్రాధాన్యత లేదనీ, పదవులు దక్కలేదన్న అలకతో పార్టీ వీడిన వారే కావడం గమనార్హం. దాసోజు శ్రవణ్ కానీ, స్వామిగౌడ్ కానీ ఇదే కోవకు చెందుతారు. అయితే తాజా ఆపరేషన్ ఆకర్ష్ కు స్పందించి తెరాసలోకి వస్తున్న వారిలో ప్రజాదరణ ఉన్న నేతలు కానీ, ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉన్న నేతలు కానీ, ఎన్నికలలో నిలబడి ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని గెలిచే నేతలు కానీ ఎవరూ లేరు.

ఎక్కడ ఉన్నా ఒకటే అనే స్థాయి నేతలు మాత్రమే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ వలకు చిక్కు గులాబి గూటికి చేరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో అటువంటి నేతల వల్ల నిజంగా టీఆర్ఎస్ కు లభించే ప్రయోజనం ఏముంటుందని.. పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ముందు తెరాసలోకి వలసలు వస్తున్నాయి.

పార్టీకి ఆదరణ తగ్గలేదు అని చెప్పుకోవడానికి తప్ప ఇటీవల తెరాసలోకి వలస వచ్చిన వారితో పార్టీకి కలిగే ప్రయోజనం పూజ్యమని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులూ అంటున్నాయి. దాసోజు శ్రవణ్ కుమార్, రాపోలు ఆనంద భాస్కర్ వంటి వారు ప్రసంగాలు చేయగలరే తప్ప ప్రజా క్షేత్రంలో గుర్తింపు ఉన్న నాయకులు కాదు. ఆ పాటి ప్రసంగాలు చేయగలిగే నేతలు తెరాసలో చాలా మందే ఉన్నారు. మరి కొత్తగా ఇటువంటి నేతలను పిలిచి మరీ పార్టీ కండువా కప్పడం వెనుక కేసీఆర్ ఆంతర్యమేమిటో  అర్ధం కావడం లేదని తెరాస శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. 

By
en-us Political News

  
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.