జగనన్నకు చెబితే మాత్రం ఏం చేస్తారు?

Publish Date:May 10, 2023

Advertisement

జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం (మే 9) లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. సంతృప్తి స్థాయిలో వినతులను పరిష్కరించే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఎం  జగన్‌ మాట్లాడుతూ... వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వ పాలనలో లంచాలు, వివక్ష ఉండేవని, టిడిపి హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని దుయ్యబట్టారు, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించానని, పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని సిఎం చెప్పారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌-1902కు కాల్‌ చేస్తే సమస్యకు పరిష్కారం అందుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని సిఎం చెప్పారు. ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం మంచి పరిష్కార వేదిక అవుతుందని నమ్మబలికారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని, ఫిర్యాదు నవెూదు చేసిన వెంటనే వైఎస్సార్‌ ఐటీ కేటాయింపు చేస్తుందని, ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు స్టేటస్‌ అందుతుందని, ప్రత్యక్షంగా సిఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని తెలిపారు.

స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. యిదంతా ఒకెత్తయితే.. ఈ నాలుగేళ్లలో జగన్ నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ బెబుతూ వస్తున్నదంతా  శుద్ధ అబద్ధమని జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంతోనే తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నాలుగేళ్ల పాలన పూర్తయిన తరువాత జగన్ యింత కాలం ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేశారని స్వీయ విశ్లేషణ చేసుకుంటే ఏమీ చేయలేదని తేలడంతోనే.. తాజాగా జగనన్నకు చెబుదాం అన్న కార్యక్రమాన్ని ప్రారంభించి.. యింత కాలం మీరు చెప్పిందేమీ నేను వినలేదని తేటతెల్లం చేశారంటున్నారు. యింత కాలం ఆయన చేసిందేమిటయ్యా అంటే.. గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలకు నాలుగేళ్ల తరువాత మళ్లీ శంకుస్థాపనను చేయడం.. అలాగే గత ప్రభుత్వంలో ఆరంభమైన పనులను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసి.. యిప్పుడు వాటిని తిరిగి ఆరంభించడం.. అలా తిరిగి ఆరంభించిన పనులకు గతంలో ఉన్న పేర్లు తీసేసి తన పేరు పెట్టుకోవడం అంటూ విమర్శలు వినవస్తున్నాయి.

యిక యిప్పుడు ఆయన తాజాగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కూడా కొత్త కార్యక్రమం ఏమీ కాదు.. గత చంద్రబాబు ప్రభుత్వం పీపుల్స్ ఫస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ విధానమే యిప్పుడు కొత్తగా జగనన్నకు చెబుదాం కార్యక్రమమని పరిశీలకులు చెబుతున్నారు.  యిప్పుడు కూడా ఈ కాల్ సెంటర్ కు అందే ఫిర్యాదులలో ఎక్కువ భాగం జగన్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పురగతికి నోచుకోని పనులు.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏయే సమస్యలపై అయితే  వైసీపీ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ ప్రజలు నిలదీశారో అవే సమస్యలు ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో  జనం ఫిర్యాదు చేస్తారని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకున్న సమస్యల పరిష్కారానికే దిక్కు లేదు.

ఓ ఫోన్ నంబర్ కు జనం తమ సమస్యలు చెబితే ప్రభుత్వం స్పందిస్తుందనుకోవడం అపోహేనంటున్నారు. ఎన్నికల ముందు చేసే హడావుడిలో భాగమే యిదని విశ్లేషిస్తున్నారు. ప్రజల సమస్యలు ఏమిటి? నాలుగేళ్లలో తాము పరిష్కరించకుండా వదిలేసిన సమస్యలేమిటి? అన్నవి ఎవరో చెబితే తెలుసుకునే దుస్థితిలో జగన్ ఉన్నారా అని జనం కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగనన్నకు చెబుదాం  అన్న కార్యక్రమం వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్టు, ఆర్ జోన్ స్థలాల పంపిణీ వంటి అంశాల నుంచి జనం దృష్టి మరల్చేందుకు తీసుకువచ్చిన ప్రోగ్రామేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.