విశాఖ నుంచే పాలన.. జగన్ తాజా ప్రకటన సంకేతమేంటి?

Publish Date:Apr 19, 2023

Advertisement

అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహస్తున్న ఏపీ సీఎం జగన్ తీరు పట్ల సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. విపక్ష నేతగా  సందర్భాల్లో  అమరావతే రాజధాని అని విస్పష్టంగాప్రకటించారు. అంతే కాదు జగన్  ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో సాధించి తెస్తానన్నారు. పాతిక మంది వైసీపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకు వస్తానని వాగ్దానం చేశారు.  

అయితే అధికారంలోకి వచ్చాకా ప్రత్యేక హోదానూ విస్మరించారు. అమరావతే రాజధాని అన్న విషయంలోనూ మడమ తిప్పేశారు. అమరావతి అభివృద్ధిని విస్మరించి మూడు రాజధానుల నాటకానికి తెరతీశారు. ఈ విషయంలో కోర్టులు అభ్యంతర పెట్టినా, అమరావతే రాజధాని అని ఏపీ హైకోర్టు విస్పష్టంగా చెప్పినా, హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించకపోయినా.. విశాఖ నుంచే పాలన సాగిస్తానంటూ ముఖ్యమంత్రి సహా ఆయన కేబినెట్ సహచరులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు బుధవారం (ఏప్రిల్ 19)న శంకుస్థాపన చేశారు. నౌపడా వద్ద పోర్టు నిర్వాసితులు కాలనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విశాఖ విషయంలో కీలక ప్రకటన చేశారు.  అందరూ మెచ్చే నచ్చే నగరంకనుకే విశాఖను రాజధానిగా ఎంపిక  చేసుకున్నామన్నారు. సెప్టెంబర్ నుంచి తాను విశాఖలోనే స్థిరపడతాను అక్కడ నుంచే పాలన కొనసాగిస్తానని విస్ఫష్టంగా చెప్పారు. వికేంద్రీకరణలో భాగమే ఇది అని చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీ గడువు డిసెంబర్ లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వస్తున్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా జగన్ విశాఖ నుంచే పాలన అన్న ప్రకటనకు ముడిపెడుతూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ ముందస్తుకు వెళతారని, అది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే ఏపీ కి కూడా ఎన్నికలు జరిగేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు.

అందులో భాగంగానే ఆయన సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన అన్న ప్రకటన చేశారంటున్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో ఉత్తరాంధ్రలో వైసీపీ ఓటమి.. విశాఖ రాజధాని ప్రతిపాదనకు అక్కడి జనం వ్యతిరేకించారనడానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో విపక్షాలపై చేసిన విమర్శలు.. తాను ఒంటరిగా పోరాడుతున్నానంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ముందస్తు సంకేతమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.