Publish Date:Nov 11, 2025
జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. చెదురుమదురు సంఘటనలు వినా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఎంత? ఏ పార్టీ పట్ల జనం మొగ్గు చూపే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు కాసేపు పక్కన పెడితే.. పోలింగ్ ప్రారంభం కావడానికి గంటల ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఓ వ్యాఖ్య.. ఈ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకోలేదా? లేక.. ఓటమిని అంగీకరించేసిందా? అన్న చర్చ మొదలైంది. అసలు మొదటి నుంచీ కూడా జూబ్లీ ఉన ఎన్నిక విషయంలో బీజేపీ అసలు రేసులో ఉందా? లేక ఆటలో అరటిపండు చందమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం మాదే అంటున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికలో విజయం ద్వారా తమ బలాన్ని ప్రదర్శించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ అభ్యర్థి ఎంపికలో జాప్యం నుంచి ఎన్నికల ప్రచారం వరకూ బీజేపీ జూబ్లీ బైపోల్ ను చాలా లైట్ గా తీసుకుందని తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది. ఒకపక్క జూబ్లీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంటే.. మరోపక్క సరిగ్గా పోలింగ్ కు గంటల ముందు ఇది చాలా చిన్న ఎన్నిక అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం.. బీజేపీ ఓటమి అంగీకర ప్రకటనలా ఉందంటున్నారు పరిశీలకులు. అంతే కాకుండా.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేవిగా ఉన్నాయం టున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-secreat-behind-kishanreddy-comments-on-jublee-39-209316.html
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.