కలర్స్ కు వ్యాధులకు సంబంధం ఏంటి? టాబ్లెట్స్ వేర్వేరు కలర్స్ లో ఎందుకుంటాయి..?

Publish Date:Mar 1, 2025

Advertisement

 

ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, నలతగా ఉన్నప్పుడు వైద్యుడిని కలపడం సహజమే.  వైద్యులు జబ్బు నయం కావడానికి కొన్ని రకాల టాబ్లెట్స్ రాసి ఇస్తారు. అయితే ఈ టాబ్లెట్స్ అన్నీ ఒకే రంగులో ఉండవు.  ఒక్కో రకం టాబ్లెట్ ఒక్కో రంగులో ఉండటం చూడవచ్చు. అసలు టాబ్లెట్స్ ఎందుకు ఇలా వేరువేరు రంగులలో ఉంటాయి? వ్యాధులకు,  టాబ్లెట్ల రంగులకు లింక్ ఏంటి? ఇవన్నీ యాదృశ్చికంగా అలా తయారవుతాయా లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ విషయాల గురించి తెలుసుకుంటే..


ఎరుపు, నీలం, ఆకుపచ్చ,  పసుపు.. ఇలా టాబ్లెట్లు చాలా రకాల రంగులలో ఉంటాయి.  టాబ్లెట్లు అన్నీ ఒకే రంగులో ఉంటే వాటిని  మింగడానికి ఏదైనా సమస్య ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? టాబ్లెట్లకు ఉండే రంగు ఎప్పుడైనా మనసును ప్రభావితం చేసిందా? ఇవన్నీ చాలామంది పట్టించుకోరు. కానీ  టాబ్లెట్ల తయారీ సంస్థలైన ఫార్మసీ సంస్థలు ప్రణాళికా బద్దంగానే ఇలా మందులను రంగురంగులలో తయారు చేస్తాయని అంటున్నారు.

పేషెంట్లకు జరిగే మేలు..


ఒక రోగి ఒకేసారి ఎక్కువ మందులు తీసుకున్నప్పుడు, వివిధ రంగుల మాత్రలు ఉంటే ఏ టాబ్లెట్ దేనికి వేసుకుంటున్నాం అనే విషయం గుర్తించడానికి సహాయపడుతుంది. అన్ని మాత్రలు ఒకేలా తెల్లగా ఉంటే రోగులకు మందులను గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. ఇది ముఖ్యంగా వృద్ధులకు,  దృష్టి లోపం ఉన్నవారికి ఇబ్బంది. అందుకే టాబ్లెట్లు


వైద్యులు,  ఫార్మసిస్ట్‌లకు  సులభం..

మెడికల్ స్టోర్లలో పనిచేసే వైద్యులు,  ఫార్మసిస్ట్‌లు కూడా మందులను త్వరగా గుర్తించడానికి వాటి రంగులపై ఆధారపడతారు. ఇది తప్పు జరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది.  సరైన ఔషధం రోగికి చేరుతుంది.


ఔషదం ప్రభావం..


చాలా సార్లు కంపెనీలు మందుల రంగును రోగి మనస్సును కూడా ప్రభావితం చేసే విధంగా ఎంచుకుంటాయి. కొన్ని ఉదాహరణలు గమనిస్తే..

నీలం, ఆకుపచ్చ మాత్రలు: సాధారణంగా నొప్పి నివారణ మందులు, ఆందోళన నివారణ, మత్తుమందుల కోసం ఈ రంగులు ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ రంగులు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.

ఎరుపు,  నారింజ మాత్రలు: శక్తిని పెంచేవి లేదా వేగంగా పనిచేసే మాత్రలలో ఈ రంగులు వాడతారు ఎందుకంటే ఈ రంగులు శక్తి,  శరీర పనితీరు పెరుగుదలను సూచిస్తాయి.

నలుపు,  ముదురు గోధుమ రంగు మాత్రలు: వీటిలో ఐరన్, విటమిన్ సంబంధిత మందులు ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాలను పెంచడానికి పనిచేస్తాయి.


సూర్యకాంతి,  ఔషధ రక్షణ..


కొన్ని మందులు ఎండలో త్వరగా చెడిపోతాయి. అందుకే కంపెనీలు ఔషధాన్ని సూర్యకాంతి నుండి రక్షించడంలో సహాయపడే రంగులను ఎంచుకుంటాయి. ముదురు రంగు పూత ఔషధ నాణ్యతను ఎక్కువ కాలం పాటు ఉండేలా చేస్తుంది.

రుచి,  వాసన..

కొన్ని మందులు చాలా చేదుగా ఉంటాయి,  రోగులకు వాటి రుచి నచ్చదు. ఈ రంగు పూత ఔషధాన్ని ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా దాని చేదు రుచిని దాచిపెడుతుంది. దీని వలన రోగులు దానిని మింగడం సులభం అవుతుంది.

పిల్లలను ఆకర్షించడానికి..


పిల్లలకు మందులు ఇవ్వడం చాలా కష్టమైన పని. అందుకే కంపెనీలు చాక్లెట్, స్ట్రాబెర్రీ, నారింజ రుచిగల సిరప్‌లు,  రంగురంగుల చూయింగ్ టాబ్లెట్‌లను తయారు చేస్తాయి.

వ్యాధిని బట్టి మందుల రంగులు నిర్ణయించబడతాయా?

సరళంగా చెప్పాలంట, ఔషధం యొక్క రంగు వ్యాధిపై ఆధారపడి ఉండదు. కానీ రోగి  మానసిక స్థితి, ఔషధం  గుర్తింపు,  దాని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇది నిర్ణయించబడుతుంది. అయితే కొన్నిసార్లు వైద్యులు మానసిక ప్రభావాల కోసం నిర్దిష్ట రంగుల మందులను కూడా  రాసిస్తుంటారు.


       
                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా,  పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు...
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.