పవన్ కు జగన్ భయపడుతున్నారా?.. తెలుగుదేశంతో జనసేన పొత్తు సంకేతాలతో గాభరా పడుతున్నారా?

Publish Date:Oct 21, 2022

Advertisement

జగన్ లో పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమౌతున్నారన్న భయంతో ఏపీ సీఎం జగన్ వణికి పోతున్నారా?.. అందుకే ఎంత పెద్ద సమస్య ప్రభుత్వాన్ని కుదిపేసేంతగా ప్రకంపనలు సృష్టించినా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్.. పన్నెత్తి సమస్యల గురించి ప్రస్తావని సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో  పార్టీ క్యాడర్ సమావేశంలో చేసిన ప్రసంగంపై స్పందించారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పార్టీ పరువును, ప్రభుత్వ పరువునూ కూడా మూసీ నదిలో కలిపేసిన సందర్భంలో కూడా పన్నెత్తి మాట్లాడని జగన్ పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించడంపై స్పందించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయినా తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన కుదిరితే.. వచ్చే ఎన్నికలలో వైసీపీ కథ ముగిసిపోతుందని బయపడుతుండటం వల్లనే జగన్ పవన్ వ్యాఖ్యలపై ఎదురుదాడికి తానే స్వయంగా పూనుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ మంగళగిరి సమావేశంలో ప్రదర్శించిన ఆవేశం, వైసీపీ నేతలపై చేసిన విమర్శల వర్షం వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే వాటిని తిప్పికొట్టడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారని అంటున్నారు.

పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన వీరావేశం రాష్ట్ర రాజ కీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. ఇంత కాలం వైసీపీ నేతల నోటి దురుసుకు భయపడో.. వారంత అసహ్యంగా మాట్లాడటం మర్యాద కాదనో ఇతర పార్టీలన్నీ ఒకింత మౌనంగానే ఉన్నాయి. ఎప్పుడైతే పవన్ వైసీపీవి ప్రేలాపనలంటూ.. ఇష్టారీతిగా నోరు పారేసుకుంటే తాను అదే స్థాయిలో విరుచుకుపడతానని హెచ్చరించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక వైసీపీ వారి దుర్బాషలను మౌనంగా సహించే పరిస్థితి ఉండదని అన్ని పార్టీల వారూ ప్రతి విమర్శలకు పదును పెడతారని జగన్ కు అర్ధమైపోయింది.

అందుకే పవన్ పై తన మంత్రుల చేత ఎదురు దాడి చేయించి ఊరుకుంటే సరిపోదని భావించి సీఎం జగనే తన నోటికి పని చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైకాపా నేతల భాషతో పోలిస్తే పవన్ మాటల్లో అభ్యంతర పెట్టవలసినంత బూతు లేదు. కానీ ఎందువల్లనో ఆ మాటలు జగన్ మనసుకు అవి ములు కులుగా గుచ్చుకొన్నాయి. పవన్ చెప్పు చూపింది తనకే అన్నంత ఆగ్రహం రగిలింది ఆయనలో. దానితో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలతో పని లేదు, నేరుగా తానే రంగంలోకి దిగి, లెక్క తేల్చేస్తానని శపథం పట్టాడు. సాధారణంగా ఎంత పెద్ద రాజకీయ రగడ జరిగినా ఇల్లు వదలి బయటకు రావడం, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం జగన్ నైజం కాదు. అనుచరులు చెలరేగిపోతుంటే తాను చిద్విలాసంగా నవ్వులు చిందించడం ఆయన తీరు. అసెంబ్లీలో వైసీపీ నేతల దుర్భాషలు చేసిన సందర్భంగానూ, పలు సందర్భాలలో కొడాని నాని, అనీల్ కుమార్ యాదవ్ వంటి వారు నోరేసుకుని విపక్ష నేతపై ఇష్టాను సారంగా చెలరేగిన సందర్భంలోనూ, అలాగే హస్తిన మద్యం కుంభకోణంలో తన సతీమణిపై ఆరోపణలు వచ్చిన సందర్బంలో కూడా జగన్ పన్నెత్తి మాట్లాడలేదు. నోరెత్తి  స్పందించలేదు.

ఏదైనా అనుచరగణమే చూసుకోవాలన్న విధానాన్ని ఇంత కాలం అనుసరిస్తూ వచ్చారు. కానీ పవన్ విషయంలో మాత్రం ఆయనలో ఆ నిగ్రహం మటుమాయమైపోయింది. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు చేసుకొంటున్న తనకు పవన్ కంట్లో నలుసు వలె మారారని ఆయన భావిస్తున్నారు. అన్నిటికీ మించి పవన్ వెనుక, ఆయన సమాజీక వర్గం సమీకరణ జరిగితే ఇక రాజకీయంగా వైసీపీకి నూకలు చెల్లినట్లే అవుతుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే ఆయనలో ఈ ఆగ్రహం, ఆవేశం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన, బీజేపీ కలిసి సాగితే జగన్ కు ఏం నష్టం ఉండదు. ఎటూ బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉంది కనుక జనసేన, బీజేపీల మైత్రి వల్ల అంతిమంగా తనకే లబ్ధి చేకూరుతుందన్నది జగన్ భావన.

అయితే ఎప్పుడైతే జనసేన, తెలుగుదేశం దగ్గర అవుతున్నాయన్న సంకేతాలు కనిపించాయో జగన్ లో గాభరా మొదలైందనీ, ఓటమి భయం పట్టుకుందనీ విశ్లేషకులు అంటున్నారు. అందుకే జగన్ స్వయంగా నోరు చేసుకుని జనసేన అధినేత పైనా, ఆ పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టడంపైనా విమర్శల బాణాలు సంధించారంటున్నారు. ఆ రెండు పార్టీల కలయికను అడ్డుకోవడమే ఏకైక అజెండాగా ఇక జగన్ కార్యాచరణ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.