ముర్ము తెలంగాణ పర్యటన రద్దు కారణమేంటి?

Publish Date:Jul 14, 2022

Advertisement

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన అర్ధంతరంగా రద్దైంది. రద్దుకు కారణం వర్షాలు అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అదే రోజు ఆమె ఏపీలో పర్యటించారు. అధికార, విపక్ష నేతలను కలిశారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. విపక్ష నేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ భేటీకి ఏపీ బీజేపీ నాయకులు సైతం హాజరయ్యారు. ఈ భేటీ ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలపై ఊహాగానాలకు సైతం తెరలేపింది. ఈ భేటీ అధికార వైసీపీని కంగుతినింపించింది. అదలా ఉంచితే.. ఏపీ  కూడా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పరిస్థితే ఉంది. అయినా ముర్ము ఏపీలో పర్యటించారు.

అదే సమయంలో అదే రోజు జరగాల్సిన తెలంగాణ పర్యటనను మాత్రం రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి ముర్ముకు వాయు మార్గంలో గంట సమయం కూడా పట్టదు. అంతే కాకుండా గన్నవరం విమానాశ్రం నుంచి ఢిల్లీకి వెళ్లడం కంటే హైదరాబా నుంచి హస్తిన యానం సులువు. అయినా కూడా ఆమె తెలంగాణకు రాలేదు. తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

అందుకు కారణమేమై ఉంటుందన్న దానిపై పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో ఆమె పర్యటనకు ముందే.. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు ముర్ముకు తమ మద్దతు ప్రకటించేశాయి. అయినా ఆమె ఏపీలో షెడ్యూల్ ప్రకారం పర్యటించారు. అధికార, విపక్ష నేతలతో బేటీ అయ్యారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో బీజేపీ మద్దతు ఎలాగూ ముర్ముకే. ఇక అధికార టీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థికే తన మద్దతు అని ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించారు. నగరంలో ఆయన రాక సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్బాటం చేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ మద్దతు ఎలాగూ విపక్షాల ఉమ్మడి అభ్యర్థికేనన్న సంగతి విదితమే. అలాగే ఎంఐఎం పరిస్థితి కూడా. ఇక పోతే ముర్ము తెలంగాణ పర్యటనలో కలవగలిగేది,

మద్దతు కోరగలిగేది ఒక్క బీజేపీని మాత్రమే.  ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ పర్యటనకు వచ్చినా తనను ప్రతిపాదించిన బీజేపీ సభ్యులు తప్ప మరే పార్టీ నుంచీ మద్దతుదొరకదు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగా పర్యటనను రద్దు చేసుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక టీఆర్ఎస్ అయితే తెలంగాణలో మద్దతు కూడగట్టడం సాధ్యం కాదని తేలిపోవడంతోనే ఆమె రాష్ట్ర పర్యటను రద్దు చేసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం నుంచి బీజేపీకి  ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న ఓట్లు బహుస్వల్పం. సో రాష్ట్ర బీజేపీ సభ్యులను ఇక్కడ కలిసి మద్దతు కోరడం కంటే హస్తినకు రప్పించుకుని మాట్లాడడమే బెటర్ అని భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.