కుమార స్వామి, కేసీఆర్ భేటీ ఆంతర్యమేమిటి?

Publish Date:Sep 12, 2022

Advertisement

జాతీయ రాజకీయాలలో చక్రంతిప్పుతానంటున్న కేసీఆర్ అందుకు సంబంధించి వరుస భేటీలతో ఇటీవల బాగా బిజీ అయ్యారు. రైతు నాయకులతో సమావేశం తరువాత కర్నాటక  మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నాయకుడు కుమారస్వామితో ఆదివారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దాదాపు గంటల సేపు జరిగిన ఈ భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు కర్నాటక రాజకీయాలపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు.

కర్నాటక అసెంబ్లీకి   వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. కర్నాటకలో పాగా వేయాలని జేడీఎస్ ఉవ్విళ్లూరుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు ఫండింగ్ చేసే విషయంలో కుమార స్వామితో భేటీలో కేసీఆర్ చర్చించినట్లు చెబుతున్నారు.  మొత్తంగా జాతీయ రాజకీయాలలో బీజేపీని దీటుగా ఎదుర్కొన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ కు కుమారస్వామి మద్దతు పలికారనడంలో సందేహం లేదు.

కుమారస్వామితో భేటీ అనంతరం ఇరువురూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఇరువురూ కూడా ప్రత్యామ్నాయ జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. దేశంలోని మోధావులు, ఆర్థిక రంగ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, రైతు సంఘాల నేతలతో చర్చించి జాతీయ అజెండాపై ఒక అభిప్రాయానికి వచ్చామన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం, నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. సబ్బండ వర్ణాలనూ కలుపుకుని సుదీర్ఘ కాలం పోరాడి, ఉద్యమించి కేసీఆర్ తెలంగాణ సాధించారని కర్నాటక మాజీ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్   దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందుండి నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనీ, జాతీయ రాజకీయాలలో కేసీఆర్ క్రియాశీలక భూమిక పోషించాలనీ, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కుమార స్వామి చెప్పారు.  త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించాలని నిర్ణయించుకోవడాన్ని స్వాగతించారు. కాగా కుమారస్వామి, కేసీఆర్ ల మధ్య భేటీలో జాతీయ రాజకీయాల చర్చ సంగతి అలా ఉంచితే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు ఆర్థిక చేయూత అందించేందుకు సంబంధించిన లావాదేవీల గురించి కూడా విస్తృతంగా జరిగిందని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఇందుకు కుమారస్వామి తన బృందంలో కర్నాటకకు చెందిన పారిశ్రామిక వేత్తను కూడా వెంటబెట్టుకుని రావడమే నిదర్శనమని చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో మద్దతుగా జేడీఎస్ నిలుస్తుందనీ, అందుకు ప్రతిగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను (ఎలక్షన్ ఫండింగ్) కేసీఆర్ అందించేట్లుగానూ ఇరువురి మధ్యా ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.