జగన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ పీకే వ్యూహాలు?

Publish Date:Nov 5, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను, వైసీపీని బలహీన పర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక వేస్తున్నారా? కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో తాను విభేదిస్తుంటే.. తమ పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్ర సీఎం జగన్ మాత్రం ఆ బీజేపీతోనే అంటకాగుతుండడం కేసీఆర్ కు ఏమాత్రం నచ్చడం లేదా? అటు నదీ జలాల విషయంలో ఇటు ప్రాజెక్టుల విషయంలో మరో పక్కన విద్యుత్ బకాయిల విషయంలో ఉమ్మడి ఆస్తుల వ్యవహారంలో ఏపీతో ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపర్చాలనే యోచనలో  కేసీఆర్ ఉండి ఉండొచ్చని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

దాంతో పాటు కేసీఆర్ ఇటీవలే తమ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో అయినా పోటీ చేయాల్సి ఉంది. దాంతో పాటు ఆయా రాష్ట్రాల్లో కనీసం 6 శాతం ఓట్లు సంపాదిస్తేనే.. బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీలో దిగాలంటే.. బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలి.. లేదంటే దానితో సర్దుబాటు అయినా చేసుకోవాలి. కానీ ప్రస్తుతం 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వైసీపీ బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు జగన్ ఏమాత్రం చోటిచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చంటున్నారు.

ఈ నేపథ్యంలోనే గురువారం (నవంబర్ 3)  కేసీఆర్ సుదీర్ఘంగా నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. అదే విధంగా ఏపీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అంతకు ముందే.. ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా గత ఎన్నికల్లో జగన్ పదవీ దాహానికి అనవసరంగా సాయం చేశానని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అనడం ఎంత మాత్రం కాకతాళీయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వం పతనమయ్యేలా పీకే, కేసీఆర్ ల ఏదైనా ప్రణాళిక రూపొందించారా అన్న అనుమానాలు సైతం వారు వ్యక్తం చేస్తున్నారు.  

ఎన్నికల వ్యూహాలు వేసేందుకు ఐప్యాక్ సంస్థను ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేశారు. అటు కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో రావడానికి, ఇటు ఢిల్లీలో కేజ్రీవాల్ కు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయం సాధించడానికి, తమిళనాడులో స్టాలిన్ కు, ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చేందుకు ఇంతకు మందు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచించారు. అయితే.. తాను ఫుల్ టైమ్ రాజకీయ వేత్తగా మారిపోయి.. బీహార్ లో పాదయాత్ర చేస్తున్న క్రమంలో  ఐప్యాక్ కు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కేసీఆర్- ప్రశాంత్ కిశోర్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని పరిశీలకలు చెబుతున్నారు. వీరిద్దరూ కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే. దాంతో శత్రువకు శత్రువు మిత్రుడంటారు కదా? అలా అన్నమాట.  ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉబలాటపడుతున్నారంటున్నారు. దీంట్లో భాగంగానే వారిద్దరూ ప్రగతి భవన్, ఫాంహౌస్ లలో పలు మార్లు భేటీ అయ్యారు. పలు వి  వ్యూహాలు రచించారు. పనిలో పనిగా ఏపీలో జగన్ ను, వైసీపీపి కూడా బలహీనం చేసే వ్యూహం ఏదో రచించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరి నోటా జగన్ మాట వినిపించిందని విశ్లేషిస్తున్నారు.

బీజేపీతో అంటకాగుతున్న జగన్ ను  ఆ పార్టీ నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. బీజేపీకి దూరం కావాలని ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాను జగన్ తిరస్కరించి ఉండొచ్చని, అందుకే పీకే జగన్ కు సహాయం చేసి తప్పు చేశానని వ్యాఖ్యానించారని చెబుతున్నారు.   మొదట్లో కేసీఆర్, జగన్  బీజేపీకి మద్దతుగానే నిలిచారు. పెద్ద నోట్ల రద్దు,  370 ఆర్టికల్ రద్దు, జీఎస్టీ,  ఉమ్మడి పౌరసత్వం, వ్యవసాయ చట్టాలు వంటి మోడీ నిర్ణయాలకు అప్పట్లో పార్లమెంట్ లో బీజేపీకి వైసీపీ, టీఆర్ఎస్ కూడా పూర్తి సహకారం, మద్దతు అందించాయి.   కానీ ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీతో టీఆర్ఎస్ విభేదించింది. కానీ.. జగన్ మాత్రం ఇప్పటికీ బీజేపీకి మద్దతు కొనసాగిస్తున్నారు. ఇదే కేసీఆర్ కు నచ్చడం లేదని అంటున్నారు. నిజానికి అన్ని విధాలా తమతో కలిసి వస్తున్న జగన్  సర్కార్ ను కూల్చే అవసరం బీజేపీకి లేదని పరిశీలకులు అంటున్నారు. అయినప్పటికీ.. ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ చెప్పడం వెనుక ఇరు పార్టీల మధ్యా చిచ్చు రగల్చాలన్న లక్ష్యమే ఉందని అంటున్నారు. మొత్తానికి బీజేపీపైన, ఆ పార్టీ పెద్దల పైన జగన్ లో అనుమానం బీజాలు నాటడం ద్వారా ఇటు కేసీఆర్, అటు ప్రశాంత్ కిశోర్ ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.