ఎర్రబెల్లి, ఉత్తమ్ రహస్య భేటీ మర్మమేమిటి?

Publish Date:Dec 21, 2022

Advertisement

తెలంగాణ రాజకీయాలలో తెరవెనుక డీల్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షొభం తారస్థాయిలో ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత, మంత్రిఎర్రబెల్లి దయాకరరావుతో రహస్యంగా భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల కిందట  మునుగోడులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ఏకాంతంగా దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు.

ఈ విషయాన్ని  గమనించిన కొందరికి వారు తమ భేటీ గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని గట్టిగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంత రహస్యంగా  అన్ని గంటల పాటు భేటీ అవ్వడం వెనుక మతలబేంటన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా.. ఢిల్లీ నుంచి హుటాహుటిన  వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా వివాహ వేడుకకు హాజరై, అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో భేటీ అయ్యారు. భేటీ పూర్తి కాగానే నేరుగా హస్తినకు బయలుదేరి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి, ఉత్తమ భేటీ జరుగుతున్న సమయంలోనే టీపీసీసీ భేటీ జరుగుతుండటం గమనార్హం.

ఈ రహస్య భేటీ నేపథ్యంలోనే గతంలో ఉత్తమ్ కుమార్  రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరి స్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనే ఉత్తమ్ కుమార్ పై కేసీఆర్ కోవర్ట్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఉత్తమ్ కుమార్ రహస్యంగా భేటీ అయిన ఎర్రబెల్లి దయాకరరావుపై కూడా గతంలో అంటే ఆయన తెలుగుదేశం తెలంగాణ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ కోవర్ట్ గా పని చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే.

ఆయన టీడీఎల్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు మిత్ర పక్షాలుగా పోటీలోకి దిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి పరాజయం పాలైంది. గెలవాల్సిన స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అయితే ఇందుకు పొత్తలో భాగంగా సీట్ల పంపకాలలో జరిగిన పొరపాట్లే ఆ ఓటమికి కారణమని అప్పట్లో తెలుగుదుశం, బీజేపీలు భావించాయి. అయితే టీడీఎల్పీ నేతగా అప్పట్లో ఎర్రబెల్లి ఇరు పార్టీలనూ మిస్ గైడ్ చేసి బీజేపీకి బలం ఉన్న స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశానికి బలం ఉన్న స్థానాలలో బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపేలా చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎర్రబెల్లి కేసీఆర్ కోవర్టుగా పని చేశారని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఎర్రబెల్లి తెలుగుదేశంను వీడి.. గులాబి గూటికి చేరడం.. కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. ఆ విధంగా కేసీఆర్ ఎర్రబెల్లి చేసిన ఉపకారానికి మంత్రిపదవితో బదులు తీర్చుకున్నారన్నమాట. ఇప్పుడు ఎర్రబెల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్య భేటీతో నాడు ఇరువురూ కేసీఆర్ కు కోవర్ట్ లుగా పని చేశారన్న విషయాలను గుర్తు చేస్తూ ఈ భేటీ వెనక మర్మమేమిటన్న చర్చ జరోందుకుంది. కాంగ్రెస్ సంక్షోభ సమయంలో అదును చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
పార్లమెంట్‌లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.