కీచకులను పంచన పెట్టుకుని సమాజానికి జగన్ ఇచ్చే మెసేజ్ ఏమిటి?

Publish Date:Aug 5, 2022

Advertisement

ఏపీలో మూడేళ్లకు పైగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం గోరంట్ల మాధవ్ తోనే మొదలు కాలేదు.  రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికలలో ఏకంగా వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను గెలిపించి అధికారం కట్టబెట్టారు. గొప్పగా పాలన అందిస్తారని ఆదేశించారు. పాదయాత్ర సందర్భంగా జగన్ చేసిన వాగ్దానాలను విశ్వసించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు,అప్పులు, దౌర్జన్యాతోనే ఈ మూడేళ్లు గడిపేసింది. అభివృద్ధిని అటకెక్కించేసింది. విమర్శలను సహించని, రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసే కొత్త సంస్కృతికి తెరతీసింది. అన్నిటికీ మించి రాష్ట్రంలో మహిళలపై  దాడులు, వేధింపులు, అత్యాచారాలు పెచ్చరిల్లాయి. అయినా సీఎం పెదవి విప్పి మాట్లాడరు. ఆయన మాట్లాడరు కనుక మంత్రలదీ మౌనముద్రే.  సమస్య ఏదయినా.. సందర్భం ఏదయినా అయితే సకల శాఖల మంత్రిగా గొప్ప గుర్తింపు పొందిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే  విజయసాయిరెడ్డి.. వీళ్లే మాట్లాడతారు. ఇక ప్రత్యర్థులపై సమయం సందర్భం లేకుండా విమర్శలు గుప్పించడానికి వైసీపీ సోషల్ మీడియా. అంతే. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్.. ఇప్పుడు ఎంపీ గోరంట్ల..వీరంతా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ వేధించి అడ్డంగా దొరికిపోయిన వారే. వీరేనా మహిళల పాలిట కీచకుడిగా మారిన వలంటీర్, సర్పంచ్.. ఎవరైతేనే వీరంతా వైసీపీ వారే. వీరందరినీ వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రి జగన్. ఇంతటి మెజారిటీతో, అభిమానంతో అధికార అందలం ఎక్కించిన వారికి జగన్ ఇస్తున్న సందేశం ఏమిటి?

వారి బాగోతాలను బైటపెట్టిన మీడియాకు పచ్చ ముద్ర వేస్తూ, విమర్శించి ఖండించిన విపక్షాలపై కేసులు బనాయిస్తూ వైసీసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని జనరంజకంగా పాలిస్తోందని జగన్ తనకు తాను కితాబులిచ్చేసుకుంటే అంతా బాగున్నట్టేనా?  అయినా ఒక ఎంపీ అయ్యి ఉండి ఒక మహిళతో వీడియోకాల్ లో అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఆయనపై చర్యలు తీసుకోవడం మాని అసలా వీడియోనే మార్ఫింగ్..దానిపై విచారణ జరిపిస్తాం అంటూ నాన్చడం ఏమిటీ? ఆ వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులకు ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేశారట. పోలీసులు విచారణ చేసిన తరువాత ఒక వేళ ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే అప్పుడు మాధవ్ పై చర్య తీసుకుంటారట.  

ఇంతకీ ఆ వీడియోలను సర్కారు ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతుందా లేదా అన్న విషయాన్నిమాత్రం  ఎంపీగారిని వెనకేసుకు వస్తూ దోషిగా తేలనివ్వండి అప్పుడు చర్య తీసుకుంటామని చెప్పిన సజ్జల చెప్పలేదు. అసలు ఇంతటి దరిద్రంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, వైసీపీలోని మహిళా మంత్రులు కనీసం నోరు విప్పలేదు. అయిన దానికీ కాని దానికీ విపక్షాలపై ట్వీట్లతో విరుచుకుపడే విజయసాయి కూడా ఇంత వరకూ స్పందించలేదు.

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే.. కనీస నైతికత లేకుండా కుటుంబ విషాదాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టారీతిన ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు తమ సొంత పార్టీ ఎమ్మెల్యే నీచ వ్యవహారంపై ఎందుకు మౌనం వహించారు.  ఇంతకూ నైతికతకు తిలోదకాలిచ్చేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వారందరికీ వెన్నుదన్నుగా నిలుస్తూ జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అప్పల్లో, అక్రమాల్లో ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంతో నేతల రోత వర్తనతో జగన్ సర్కార్ ఏపీ పరువును గంగలో కలిపేసిందంటున్న మహిళల విమర్శలకు ఏం సమాధానం చెప్పగలరు?

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.