కొత్త ఏడాదిలో అతిగొప్ప సంకల్పం.. మీరు బాగుండాలంటే ఇది చేయండి..!

Publish Date:Jan 13, 2026

Advertisement


ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు.  జీవితంలో ఎవరికి వారు బాగుండాలంటే దానికి కావాల్సింది తమ చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం లేదా వారు  అర్థం చేసుకోవడం కాదు.  ప్రతి వ్యక్తి తాము మారితేనే తమ జీవితం బాగుంటుందని అంటున్నారు లైప్ స్టైల్ నిపుణులు. కొత్త సంవత్సరంలో చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు.  అయితే దానికోసం మొదటగా ప్రతి ఒక్కరు తనకు తాను మారాలి అనే సంకల్పం చేసుకుంటే అదే గొప్ప మలుపు అవుతుంది.  ఇది ఎందుకు మేలు చేస్తుంది? దీని కోసం ఏం చేయాలి? అనే విషయం తెలుసుకుంటే..

అహంకారం.. దూరం..

 కుటుంబం అయినా, స్నేహం అయినా లేదా ఆఫీసు  అయినా మనిషిలో ఉండే  అహం సంబంధాలలో చీలికకు అతిపెద్ద కారణం అవుతుంది. చాలా సార్లు అవతలి వ్యక్తి సరైన విషయం చెబుతున్నా  అది  వినే వారి  అహాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అది నిజమైనా,  అది మంచి విషయం అయినా దాన్ని అస్సలు అంగీకరించరు.  ఈ చిన్న ఇగో కాస్తా క్రమంగా విభేదాలకు,  దూరానికి కారణమవుతుంది. కొంతమంది ఎప్పుడూ తాము ఇతరులకన్నా గొప్పవారిగా భావిస్తారు.   వారి మాటలే ఫైనల్ అంటుంటారు. అలాంటి మనస్తత్వం రిలేషన్స్ లో  చేదు అనుభవాలను తెస్తుంది. బంధాలు కొనసాగాలి అంటే అహాన్ని పక్కన పెట్టడం,  అవతలి వ్యక్తి స్థానాన్ని అర్థం చేసుకోవడం, చిన్న విషయాలను విస్మరించడం చాలా ముఖ్యం.  ఈ చిన్న మార్పు పెద్ద వివాదాలను నిరోధించగలుగుతుంది.

ఇతరులను మార్చకండి..

రిలేషన్స్ లో అయినా ఇతర విషయాలలో అయినా చాలా మంది తమ సమయాన్ని, శక్తిని ఎదుటి వ్యక్తిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతారు. కానీ నిజం ఏమిటంటే ఇతరుల  స్వభావాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మనం ఇతరులను మార్చడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తామో, అంతగా నిరాశ చెందుతాము. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా  ఉండేవారు సమస్యలకు సులభంగా పరిష్కారాలను కనుగొంటారు. చాలా పాజిటివ్ గా,  సంతోషంగా ఉన్న వ్యక్తులు ఒత్తిడి, నిరాశ, అధిక రక్తపోటు,  ఆందోళన వంటి సమస్యలను రాకుండా చూసుకోగలుగుతారు.  అందుకే ఇతరులను మార్చడం కంటే మనలో మార్పు కోసం కృషి చేయడం తెలివైన పని.

పాజిటివ్ గా ఉండాలి..

ఏ సంబంధం కూడా పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. మనం ఇతరుల కోణం నుండి  విషయాలను అర్థం చేసుకోకపోతే చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి.  అంచనాలు ఉన్నప్పుడు ఇతరులలో  తప్పులను వెతకుతుంటాము. ఇది  అసంతృప్తికి గురిచేయడమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో.. అప్పుడు పరిస్థితులు కూడా పాజిటివ్ గా కనిపిస్తాయి.  మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తులు శారీరకంగా,  మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

ఆత్మ పరిశీలన..

ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు.. అలాగే ఎవరూ అన్ని విషయాలలో కరెక్ట్ గా ఉండరు. మన బలహీనతలు, తప్పులు,  తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం.  మొదట మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడం,  మన లోపాలను అంగీకరించడం చాలా అవసరం. మన మనస్సును,  తెలివితేటలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. మనం మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుంటే మన తప్పులను అంగీకరించడం సులభం అవుతుంది. ఎవరికి వారు మారితే  ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది.  జీవితాన్ని మరింత సమతుల్యంగా చేస్తుంది. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మనస్సు,   సంబంధాల మధ్య సామరస్యం, మనలో సానుకూల మార్పులు చేసుకోవడం..  ఇవన్నీ  సంతోషకరమైన జీవితానికి మొదటి అడుగు అవుతాయి.  

కాబట్టి జీవితం బాగుండాలంటే.. ఎవరి జీవితం వారికి బాగుండాలంటే పైన చెప్పుకున్న మార్పులు వచ్చే విధంగా కొత్త ఏడాదిలో ఒక లక్ష్యం పెట్టుకుని వాటికి అనుగుణంగా మారాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు.

                            *రూపశ్రీ.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.