గ్రేహౌండ్స్ కి ఇక ప‌ని లేదా?!

Publish Date:Feb 28, 2026

Advertisement

మావోయిస్టు ఉద్యమం దాదాపుగా అంతిమ దశకు చేరుకున్న ప‌రిస్థితిలో, గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి ప్రత్యేక దళాల భవిష్యత్తు ఏంటి?  వాటికి ఇక ప‌ని లేదా?  ఆయా విభాగాలు ఇక క‌నుమ‌రుగు అయిపోతాయా? అన్న‌ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, ఉద్యమం నశించినా  గ్రేహౌండ్స్ వంటి దళాలు పూర్తిగా కనుమరుగు కావు,  వాటి రూపురేకలు, బాధ్యతలు మారొచ్చని అంటారు నిపుణులు.

గ్రేహౌండ్స్ ద‌ళాల సృష్టిక‌ర్త ఎవ‌రు?  మావోయిస్టుల‌పై దాని ప్ర‌భావ‌మెంత‌?  ప‌ర్యావ‌శానాలేంటి? అని ప‌రిశీలిస్తే.. 1989లో అప్పటి ముఖ్యమంత్రి  నందమూరి తారకరామారావు  హ‌యాంలో ఈ ప్ర‌త్యేక‌ ద‌ళం ఏర్పాటైంది. అప్ప‌టి పీపుల్స్ వార్ న‌క్స‌లైట్లు అడ‌వుల్లో గెరిల్లా రీతిలో దాడులు చేస్తూ పోలీసుల‌కు దొర‌క్కుండా  త‌ప్పించుకుని తిరిగేవారు. సాధార‌ణ పోలీసు కెపాసిటీ అడ‌వుల్లో ప‌ని చేయ‌ద‌ని గుర్తించిన కేఎస్ వ్యాస్.. అడ‌విబిడ్డ‌ను అడివిలోనే కొట్టాలి.. అనే ఐడియాతో ఈ ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ ద‌ళాన్ని సృష్టించిన కేఎస్ వ్యాస్   1993 లో హైదరాబాద్ లోని లాల్ బ‌హుదూర్ స్టేడియంలో  మావోయిస్టులు కాల్చి చంపారు. 

అద‌లా ఉంచితే.. మావోయిస్టు ఉద్య‌మాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టిన ఘ‌న‌త   గ్రేహౌండ్స్ ద‌ళాల‌దే అనడంలో సందేహం లేదు.  ఒక‌ప్పుడు అడ‌వులు మావోయిస్టుల‌కు ఒక క‌వ‌చంలా ఉండేవి. అయితే  గ్రేహౌండ్స్ ద‌ళాలు అవే అడ‌వుల్లోకి చొచ్చుకుని వెళ్లి మరీ మావోయిస్టుల‌కే  చుక్క‌లు చూపించాయి.  ఇంత‌కీ ఈ దళాల ప్ర‌త్యేక‌త‌లేమింటంటే.. గ్రేహౌండ్స్ ద‌ళ స‌భ్యులు.. వారం ప‌ది  రోజుల పాటు నిద్రాహారాలు మాని.. మాటు వేయ‌గ‌ల‌రు. దీంతో మావోయిస్టు అగ్ర‌నేత‌లు సుర‌క్షిత ప్రాంతాల కోసం పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛ‌త్తీస్ గ‌ఢ్ కి పారిపోవ‌ల్సి వ‌చ్చేది. ఎన్ కౌంట‌ర్ల ద్వారా న‌ల్ల‌మ‌ల‌, ఏఓబి దాడుల ద్వారా మావోయిస్టు నాయ‌క‌త్వాన్ని గ్రేహౌండ్స్ తుడిచిపెట్టేది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమం దాదాపు నామరూపాలు లేకుండా పోవడానికి గ్రేహౌండ్స్ ద‌ళం ప్రధాన కారణం.  అడవుల్లో హింస తగ్గడంతో మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వ‌చ్చి చేరాయి. నేడు అమెరికాలోని గ్రీన్ బెరెట్స్ వంటి  ద‌ళాలు  గ్రేహౌండ్స్ శిక్షణను అధ్యయనం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఏర్పడిన గ్రేహౌండ్స్ తరహా దళాలకు..ఉదాహ‌ర‌ణ‌కు మహారాష్ట్రలో C-60, ఛత్తీస్‌గఢ్ స్పెష‌ల్ ఫోర్సుల‌కు ఇదే స్ఫూర్తి.

అలాంటి గ్రేహౌండ్స్ పూర్తిగా ప‌క్క‌కు పెట్ట‌డం అసాధ్యంగా భావించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత పోరాటాల్లో గ్రేహౌండ్స్ శిక్షణ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. కనుక.. ఇతర రాష్ట్రాల పోలీసులకు, అలాగే కొత్త‌గా రిక్రూట్ అయ్యే పోలీసులకు.. కమాండో ట్రైనింగ్  ఇచ్చే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ గా ఇవి రూపాంత‌రం చెందే అవ‌కాశ‌ముందని అంటున్నారు. దేశంలో ఎక్క‌డైనా   స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ కి అవ‌స‌ర‌మైన‌పుడు వీటిని వాడుకుంటారు.

ఉద్యమం నశించాక కనుమరుగయ్యే లేదా మార్పు చెందే ఇతర దళాలు ఏంటో చూస్తే  స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్యూరో.. ఇది మావోయిస్టు క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్ట‌డానికి ఏర్ప‌డిన ప్ర‌త్యేక విభాగం. ఇక‌పై ఇది సైబ‌ర్ క్రైమ్, ఉగ్ర‌వాదం, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త వైపు త‌న దృష్టి మ‌ళ్లిస్తుంది. అయితే ప్ర‌తి జిల్లా పోలీస్ ఆఫీస్ లో ఉండే.. యాంటీ న‌క్స‌ల్ సెల్స్, లేదా స్పెష‌ల్ పార్టీలు క్ర‌మంగా  ర‌ద్ద‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ సిబ్బందిని లా అండ్ ఆర్డ‌ర్ లేదా క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్లోకి మ‌ళ్లించ‌వ‌చ్చు. ఇక అడ‌వికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోని గ్రామ ర‌క్ష‌ణ ద‌ళాలు, ఇన్ఫార్మ‌ర్ వ్య‌వ‌స్థ క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశ‌ముంది. మావోయిస్టుల ముప్పు కార‌ణంగా కొంద‌రు లీడ‌ర్ల‌కు అత్యంత భారీ భ‌ద్ర‌తను ఇచ్చే జెడ్ కేట‌గిరి సెక్యూరిటీని ఇక‌పై త‌గ్గించ‌వ‌చ్చు. ప్రస్తుతం పెరుగుతున్న గంజాయి, సింథటిక్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి గ్రేహౌండ్స్ తరహా శిక్షణ ఉన్న వారు అవసరం. దీంతో వారిని ఈ విభాగాల‌కు పంప‌వ‌చ్చు. స‌ముద్ర తీరం ద్వారా జ‌రిగే అక్ర‌మ ర‌వాణా అడ్డుకోవ‌డం వంటి వాటికి కూడా ఈ దళాలను వినియోగించే అవకాశాలున్నాయి.  ఇక సైబ‌ర్ వార్ ఫేర్ కి వీటిని షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.   ఏది ఏమైనా నాడు  ఎన్టీఆర్ హ‌యాంలో  ఆరంభమైన గ్రేహౌండ్స్ నేటి మావోయిస్టు ఉద్య‌మం న‌శించి పోవ‌డానికి ప్రధానకారణాలలో ఒకటి అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్ప‌టి మావోయిస్టు పార్టీ  దుస్థితికి  ఎన్టీఆర్ జ‌మానాలో పుట్టిన గ్రేహౌండ్స్ ది కీల‌క పాత్ర‌ అనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. 

By
en-us Political News

  
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.