కొడాలి నాని పరిస్థితి ఏంటి.. వైసీపీ కూరలో కరివేపాకేనా?

Publish Date:Oct 6, 2022

Advertisement

వాడుకోవడం అనే పదాన్ని వాడుకోవడంలో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసినంతగా.. ఆ పార్టీలో మరోకరిని తెలియదనే ఓ చర్చ వైసీపీలో  లీడర్ నుంచి క్యాడర్ వరకు జోరుగా నడుస్తోంది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చే వరకు తల్లి విజయమ్మ, చెల్లి  షర్మిల సేవలను ఎంతగా ఉపయోగించుకున్నారో తెలిసిందే. ఆ తరువాత అధికారం దక్కిన తరువాత  వారిని  జగన్ పక్కన పెట్టేయడంతో వారు  తెలంగాణకు పరిమితమైన సంగతి  తెలిసిందే.  తాజాగా ఇలా వదిలించుకునే వారి జాబితాలోకి   గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా చేరిందన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది.

ఇటీవల జగన్ అధ్యక్షతన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో.. పని తీరు బాలేదంటూ హెచ్చరించిన వారి జాబితాలో కొడాలి నాని పేరు కూడా ఉందని, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో  కొడాలి నానికి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాల్లోనే కాదు, గుడివాడ నియోజకవర్గంలో కూడా జోరుగా సాగుతోంది.  జగన్ వ్యవహార శైలి కొడాలి నాని స్పందన సంగతి పక్కన పెడితే, నాని ఫ్యాన్స్ మాత్రం తెగ హర్టయిపోయారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  

వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే.. తన కేబినెట్‌లోకి కొడాలి నానిని తీసుకున్నారు. ఆ క్రమంలో  జగన్‌పై దోమ కాదు సరికదా ఈగ కూడా వాలనివ్వకుండా కొడాలి నాని చూసుకున్నారని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాహుబలి సినిమాలో కట్టప్ప మాదిరిగా  జగన్ పట్ల వ్యవహరించారని వారు గుర్తు చేసుకుంటున్నారు.  జగన్‌పై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇలా విమర్శలు గుప్పిస్తే.. అలా ప్రెస్ మీట్ పెట్టి.. అలా అలా బండబూతులతో వారిపై విరుచుకుపడేవారని కొడాలి నాని ఫ్యాన్స్ ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.

దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు కాస్తా.. బూతుల సరఫరా శాఖ మంత్రిగా ప్రజల్లో   నానిపోయిందని వారు చెబుతున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో ఇతర మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నాబాబు వగైరా వగైరా ఉన్నా.. వారికెవరికీ రానీ పేరు..గుర్తింపు కొడాలి నానికి మాత్రమే వచ్చిందని వారు వివరిస్తున్నారు. అలాంటి తమ నాయకుడు ప్లస్ తమ ఆరాధ్య దైవం కొడాలి నానిని అలా వాడుకొని ఇలా వదిలేస్తారా? అంటూ వారంతా జగన్ పై గుస్సా అవుతున్నారు.   

చివరికీ జగన్ కోసం కొడాలి నాని రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేశ్‌, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై నాని విమర్శలు గుప్పించారని వారు గుర్తు చేసుకొంటున్నారు. జగన్ మలి కేబినెట్‌లో కూడా కొడాలి నానికి చోటు దక్కుతుందని తామంతా భావించామని.. కానీ అలా జరగలేదని వారు వివరిస్తున్నారు.

చివరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి.. వైయస్ఆర్ పేరు పెట్టడంపై కొడాలి నాని మనస్సు తీవ్రంగా గాయపడిందని..... అయన ఈ అంశంపై తమ అభిమాన నాయకుడు నాని ఎక్కడా పెదవి విప్పలేదని.. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్   గుర్తు చేస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ కోసం తమ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంత చేస్తే.. చివరికీ ఆయన పట్ల వైయస్ జగన్ ఇలా.. వ్యవహరించడం సరికాదని మొత్తం మీద నానిని జగన్ కూరలో కరివేపాకులా తీసి పారేశారన్న భావన మాత్రం అందరిలో వ్యక్తమౌతోంది.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.