కవిత దారెటు.. ఈ ప్రశ్నకు బదులేది?

Publish Date:Jun 13, 2025

Advertisement

సరదాగా.. కొంచే కామెడీ..గా అయితే.. బాలయ్య బాబులా... సరే.. సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి?’ అనుకోవచ్చు.  కాదూ..  కూసింత సీరియస్’గా చెప్పుకుందామంటే, రజనీకాంత్ చెప్పిన  అతిగా ఆశ పడే ఆడది.. ఆతిగా ఆవేశ పడే మగాడు సుఖ పడినట్లు చరిత్రలో లేదు  అన్న డైలాగు  గుర్తు చేసుకోవచ్చు.  అవును..  మన ఇప్పుడు మాట్లాడు కుంటున్నది  బీఆర్ఎస్ లో తిరుగు బావుటా ఎగరేసిన   ఎమ్మెల్సీ,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె  కల్వకుంట్ల కవిత గురించే.  నిజానికి..  కవిత మనసులో ఏముందో అప్పుడే కాదు.. ఇప్పటికీ అంటూ ఈరోజుకు కూడా ఎవరికీ తెలియదు. అందుకే..  ఆమె  ఏదో ఉహించుకుని అడుగు ముందుకు వేశారా.. లేక అత్యాశకు పోయి గడప  దాటారా? అనేది ఒక విధంగా ఈ రోజుకూ  శేష ప్రశ్నగానే ఉందని అంటున్నారు. అలాగే..  అమెది తిరుగు బాటు కాదు..  కేసీఆర్ వ్యూహంలో భాగమనే ప్రచారం కూడా జరుగుతోంది.   

అయితే..  రెండు రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు ఎదురు వెళ్ళిన   కవితను కంటి సైగతోనే  కేసీఆర్ దూరంగా ఉంచిన వైనం  గమనిస్తే..  కవిత ప్రవర్త కేసీఆర్ ను గట్టిగా హర్ట్ చేసిందనీ,  ఆమె పట్ల కేసీఆర్   నిజంగానే చాలా   కోపంగా ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైం దని అంటున్నారు.

నిజానికి  అందరికీ మరీ ముఖ్యంగా కవితకు  తమ స్థానం ఏమిటో అర్థం అవడం కోసమే కేసీఆర్  అందరి ముందూ కవితను దూరం పెట్టారని అంటున్నారు. అలాగే  ఆమె ఎవరిని  దేవుడి చుట్టూ చేరిన దయ్యాలు గా పేర్కొన్నారో వారు అదే స్థానాల్లో అలాగే ఉన్నారు. కేసీఆర్ వారికి ముందు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇచ్చారు. ఇస్తున్నారనే విషయం కూడా విచారణ క్రమంలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.  

అంటే..  గతంలో తామే గులాబీ జెండా నిజమైన యజమానులమంటూ చిన్నపాటి ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈటల రాజేందర్ తదితర నాయకుల పట్ల వ్యహరించిన తీరుగానే  కవిత విషయంలోనూ కేసీఆర్ కఠిన వైఖరి కొనసాగిస్తారని అనుకోవచ్చని అంటున్నారు.ఈ నేపధ్యంలో కవిత రాజకీయ భవిష్యత్తు  ఏమిటనేది  ప్రశ్నగా మారిందని అంటున్నారు.

నిజానికి..  కవితకు ఇప్పటికే పరిస్థితి అర్థమైందనీ  అందుకే ఆమె  తండ్రికి దగ్గరయ్యేదుకు   ప్రయత్నాలు చేస్తున్నట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్  కు కాళేశ్వరం కమిషన్  నోటీసు ఇవ్వడాన్ని  ప్రశ్నిస్తూ..  ‘జాగృతి’ బ్యానర్ పై నిరసన ప్రదర్శన  నిర్వహించడం  పిలుపు లేకుండానే పలకరించేందుకు ఫార్మ్ హౌస్ కు వెళ్ళడంతో పాటుగా..  ఇతర చానల్స్ ద్వారా కూడా  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇంత వరకు అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రానట్లు తెలుస్తోంది. అదే సమయంలో..  ఇప్పటికిప్పుడు పార్టీ పరంగా కవిత పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోక పోవచ్చని అంటున్నారు.

అలాగే..  పార్టీ పెట్టే అవకాశం గానీ వేరే పార్టీలో చేరే పరిస్థితి కానీ  కవితకు లేదని అంటున్నారు.  ముఖ్యంగా  తాను కాంగ్రెస్ పార్టీలోఉన్నంత వరకు కేసీఆర్  ఫ్యామిలీలో ఎవరినీ కాంగ్రెస్  లో చేర్చుకునే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపధ్యంలో కాంగ్రెస్  తలుపులు కవితకు మూసుకున్నట్లే అంటున్నారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనక్కరలేదు.  సో .. కవిత రాజకీయ భవిష్యత్ ఏమిటి ? ఆమె మరో షర్మిల అవుతారా ? లేక ఏదో దారిన ఫార్మ్ హౌస్ కు చేరతారా? కవిత దారెటు .. ఈ ప్రశ్నకు బదులేది?

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.