'దీపావళి ఒక వెలుగుల పండగ' అంటూ విమర్శలు చేస్తున్న వేది పండితులు...

Publish Date:Oct 22, 2019

Advertisement

దీపావళి అంటే దీపాల వరుస అంతేగానీ టపాసుల మోత కాదంటున్నారు కొందరు వేదపండితులు. సనాతన ధర్మం ఏ రోజు కాలుష్యాన్ని ప్రేరేపించిందని చెబుతున్నారు. నరకాసుర వధ జరిగిన తరువాత దేవ దుందుభులు మోగించి హర్షాతిరేకాలు చేసి నర్తించారని గుర్తుచేస్తున్నారు. ఈ టపాసులన్నీ మధ్యలోనే వచ్చిన ఆడంబరంగా అభివర్ణిస్తున్నారు. వాస్తవంగా టపాకాయలు కాల్చడం వల్ల ఎక్కడా పురాణాల్లో వర్ణింపబడలేదు. నృత్యాలు చేశారని, దేవదుందుభులు వాయించారని, కరతాళ ధ్వనులు చేశారని హర్షాతిరేకాలు ప్రదర్శించారని ఒకప్పుడు అవన్నీ వగైరాలు చేశారని వర్ణనలు ఉన్నాయి. కానీ ఈ విధంగా టపాకాయలు కాల్చమని ఎక్కడా కూడా పురాణాల్లో వర్ణన లేదు. ఈ మధ్య కాలంలో ఇది క్రమంగా పెరిగి పెరిగి ఇది ఎట్లా తయారయ్యిందంటే నేషనల్ ఇన్ కమ్ వేస్ట్ కింద వస్తున్నట్టుగా ఉంటోంది. 

దీపావళి నాడు అమ్మవారికి పూజ చేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు దీపాల రంగవల్లులు పేరుస్తారు. కానీ ఇంట్లో అమ్మవారిని భక్తితో పూజించి బయటకొచ్చి అదే అమ్మవారి ప్రతిమ ఉన్న బాణసంచాను కలుస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో పడి పండుగల పేరుతో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మంచిది కాదన్నది పెద్దల సూచన. నరకాసురుని సంహరించడానికి ఎంత ఇబ్బందుల అయ్యాయో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఈ రోజులలో కాలుష్యం వల్ల జరుగుతుంది. ఇది గమనించి ప్రజలందరూ మన సనాతన ధర్మంలో చెప్పినట్లు ధర్మాలు ఆచరించినపుడు మనకు క్షేమంగా ఉంటుంది. అప్పుడే నిజమైనటువంటి నరక చతుర్దశి చేసుకున్నటువంటి ఆనందం మనకు కలుగుతుంది అని పండితులు వర్ణిస్తున్నారు. 

ఇప్పుడు అంతా కూడా రసాయనాలతో చేసినటువంటి టపాసులను వాడుతున్నారు. అలాగ కాకుండా చక్కగా ఇల్లంతా దీపాలు, వీధంతా దీపాలను పెట్టుకుంటే మొత్తం కూడా కాంతితో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. దీపావళి నాడు నువ్వుల నూనె, ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ స్వచ్ఛమైన వెలుగుల స్థానంల్లో కళ్లు జిగేలుమనే కలర్ ఫుల్ లైట్స్ వచ్చాయి. కొవ్వొత్తులు చేరిపోయాయి. దీపం సుభాలను సూచిస్తే కొవ్వొత్తి శోకాన్ని ఆహ్వానిస్తుందని చెబుతున్నారు కొందరు. బాణసంచ సంబరమే కానీ సంప్రదాయం కాదని అంటున్నారు. ఈ దీపాన్ని వెలిగించడం ఎందుకంటే మనలో ఉన్న పాపం హరించడం కొరకు కాబట్టి అలాంటి దీపాన్ని గనక వెలిగిస్తే "సంధ్యాదీపం నమోస్తుతే" ఏ సమయంలో వెలిగించాలంటే సంధ్యాకాల సమయంలో వెలిగిస్తే హరిస్తుంది అనడానికి నిదర్శనం ఈ దీపావళి పండుగ. టపాసుల కాల్చివేతతో ప్రమాదం ఉందనేది కొందరి మాట. 

దీనిలో మరో కోణం కూడా ఉంది. బాణసంచా కాల్చడం సంబరం కాదని సంప్రదాయమని అంటున్నారు బంగారయ్యశర్మ. నరకాసురుడి వధ తర్వాత గంధకంతో చేసిన పదార్థాన్ని పేల్చారని వివరిస్తున్నారు. టపాసుల్ని పెట్టడము వెలిగించటం అనేటటువంటి ఆచారము మనకి ఎప్పడి నుంచో ఉంది అదేమీ కొత్తగా ఇవాళ ఏదో ఈ కంపెనీస్ అన్నీ వచ్చిన తరువాత వచ్చినటువంటిది కాదు. కాబట్టి భారతదేశంలో ఈ రకమైనటువంటి విజ్ఞానం గంథకం వాడీ ఎలా స్ఫోటకం చేయొచ్చో అనేటటువంటి విద్య ఎప్పటి నుంచో ఉంది. రససిద్ధులు మనకి రకరకాలుగా చెప్పబడే ఉన్నాయి. ఎవరి మాట ఎలాగున్నా ఎవరివాదన ఏదైనా రసాయనాలు నిండిన టపాసులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి అన్నది నిజం. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా అన్నది వాస్తవం.మరి ఈ దీపావళి వెలుగుల పండుగగా ఉండబోతోందా లేక మోతలు మోగించేలా ఉండబోతోందా అన్నది చూడాలి.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.