క్షమాపణ మంచిదే.. కానీ ఎప్పుడూ మీరే క్షమాపణ చెబుతుంటే జరిగేది ఇదే..!

Publish Date:Nov 8, 2024

Advertisement

 

క్షమాపణ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది.  అపార్థాలు తొలగిస్తుంది. ప్రేమ, స్నేహం,  కుటుంబ బంధాలు, వైవాహిక జీవితం ఇలా ఏదైనా కావచ్చు.  ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థాలు ఏర్పడినప్పుడు ఇద్దరూ ఎడముఖం,  పెడముఖం పెట్టుకుని ఉంటారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తగ్గి క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మళ్లీ చిగురిస్తుంది.  బంధం కోసం ఇలా తగ్గడంలో తప్పులేదని పెద్దలు,  రిలేషన్షిప్ నిపుణులు కూడా చెబుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు వారిద్దరిలో ఎవరైతే తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తుంటారో వారు బంధం కోసం తమ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పేస్తుంటారు.  ఇది కూడా బంధం బలపడుతుందని తిరిగి తమ ఇద్దరి జీవితాలు ఒక్కటిగా సాగుతాయనే ఆలోచనతో అలా చేస్తుంటారు. అయితే గొడవ జరిగిన ప్రతి సారి ఒక్కరే ఇలా తగ్గుతూ క్షమాపణ చెప్పడం జరిగితే అది ఖచ్చితంగా తప్పే.. ఎందుకు? అలా క్షమాపణ చెబుతూ ఉండటం వల్ల జరిగే నష్టం ఏంటి? తెలుసుకుంటే..

క్షమాపణ చెబితే నీ తల మీద కిరీటం ఏమైనా పడిపోతుందా.. నీ ఆస్తులేమైనా కరిగిపోతాయా.. ఇలాంటి మాటలు తరచుగా వింటూ ఉంటాం.  క్షమాపణ చెప్పడం అనేది ముమ్మాటికి తప్పు కాదు. అది ఒక బంధాన్ని నిలబెట్టే ఆయుధం. అయితే ఎప్పుడూ ఒకరే క్షమాపణ చెబుతూ అది ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని,  ఆ వ్యక్తి విలువను రోజురోజుకూ తగ్గించేస్తుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.

అసలు క్షమాపణ చెప్పడం తప్పు కాదని చెప్పినప్పుడు.. క్షమాపణ చెప్పడం వల్ల కలిగే ముప్పు ఏమిటో తెలుసుకుంటే..

క్షమాపణ చెప్పడం అన్నివేళలా సరైనది కాదు..

ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు.. తన తప్పును ఆ వ్యక్తి గుర్తించినప్పుడు లేదా తన తప్పు గురించి ఇతరులు చెప్పినప్పుడు..  అది నిజంగా తప్పే అని అనిపిస్తే క్షమాపణ చెప్పడంలో ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు.  తను తప్పు చేశానని నిస్సంకోచంగా ఒప్పేసుకోవాలి.  తప్పు చేశానని,  బాధపెట్టానని చెప్పి క్షమించమని అడగడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ  తప్పు లేకపోయినా తప్పు చెబితే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.  విలువను తగ్గిస్తుంది.  ముఖ్యంగా ఎదుటివారి దృష్టిలో మర్యాద అనేది  లేకుండా పోతుంది. అందుకే తప్పు ఉంటేనే క్షమాపణ చెప్పాలి.

విజయాలు సాధించడం అంటే అది వ్యక్తి అభివృద్దికి సూచన.  ఎప్పుడైనా ఏదైనా విజయం సాధించినప్పుడు దాని సందర్భంగా ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే అది మంచిది కాదు.. అలా సాధించిన విజయం గురించి ప్రస్తావించి ఇతరులకు క్షమాపణ చెబితే సాధించిన విజయానికి విలువ లేకుండా పోతుంది.

ఏదైనా విషయం గురించి స్నేహితులు,  సన్నిహితులు,  సహోద్యోగులు, కుటుంబ సభ్యులు మొదలైన వారి ముందు ఆరోగ్యకరమైన చర్చ చేస్తున్నప్పుడు మధ్యలో  ఎవరికీ క్షమాపణ చెప్పకూడదు. మాట్లాడే విషయంలో స్పష్టత, నిజం ఉన్నప్పుడు ఏ విషయాన్ని అయినా నిస్సంకోచంగా చెప్పవచ్చు.  అలా కాకుండా మధ్యలో క్షమాపణ చెప్పడం, చర్చ నుండి తప్పుకోవడం చేస్తే చర్చలో బలహీన వ్యక్తులుగా పరిగణింపబడతారు.


అభిప్రాయాలను పంచుకునే హక్కు అందరికీ ఉంటుంది . అలాగే ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాలు అనేవి ఉంటాయి.  అవన్నీ కాకుండా ఇతరులతో సొంత అబిప్రాయాలు చెప్పినప్పుడు వాటి గురించి క్షమాపణ కోరడం కూడా మంచిది కాదు.. అలాగే ఎదుటి వారు తమ అభిప్రాయాన్ని చెబుతున్నప్పుడు  వారికి సున్నితంగా క్షమాపణ చెప్పి వారు చెప్పే విషయాన్ని వినకుండా తప్పించుకోవడం కూడా మంచిది కాదు.

ఎవరైనా సహాయం కోసం అర్థిస్తున్నప్పుడు వారికి సారీ చెప్పి తప్పించుకోవడం చాలా తప్పు.  అలాగే సహాయం అవసరమైనప్పుడు సారీ చెప్పి బంధాలు పునరుద్దించుకోవడం కూడా తప్పే.. తప్పును కప్పి పుచ్చుకుని ఆ తరువాత ఇలా చేయడం తప్పే..
                                     
పదే పదే క్షమాపణ చెప్పడం కొందరికి అలవాటుగా ఉంటుంది.  బలహీన మనస్కులు,  బంధాల విషయంలో భయపడేవారు.. ఎదుటివారి డ్యామినేషన్ ను భరించలేని వారు.. బంధం తప్పనిసరిగా కోరుకునే వారు.. ప్రేమ రాహిత్యంతో బాధపడేవారు తప్పు లేకపోయినా.. జరిగింది చిన్న తప్పు అయినా,  ఎదుటివారి తప్పు ఉన్నా తామే పదే పదే క్షమాపణ చెబుతుంటారు.  ఇలాంటి వారిని జోకర్ లు గా భావిస్తారు తప్ప.. వారి మనసును గుర్తించరు. అందుకే ఎవరికీ పదే పదే క్షమాపణ చెప్పకండి.


                                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.