Publish Date:Jul 26, 2025
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది. దాని కంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వరుసగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ భయాన్ని ఎత్తి చూపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీ అంత వరకూ ప్రదర్శిస్తూ వస్తున్న గాంభీర్యం లేదా మేకపోతు గాంభీరం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. పొంతన లేని ప్రకటనలతో పార్టీలో నెలకొన్న అయోమయాన్ని బహిర్గతం చేసుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో సజ్జల బయటకు వచ్చి వైసీపీ అనుకూల మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూల సారాంశం ఏమిటన్న దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత నష్టనివారణ, క్యాడర్ లో ధైర్యాన్నినింపడం ఎజెండాగా సజ్జల మాట్లాడిన మాటలు క్యాడర్ లో ధైర్యం నింపడం సంగతి అటుంచి క్యాడర్ ను మరింత గందరగొళంలోకి నెట్టేశాయి. మొత్తంగా సజ్జల మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న సంకేతం ఇచ్చారు. జగన్ అరెస్టు కు క్యాడర్ ను సంసిద్ధం చేయడమే ఆయన ఇంటర్వూల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో సజ్జల సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన నాడు అన్ని శాఖలపైనా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ ఏడాది కాలంలో ఆయనకు పనేమీ లేకుండా పోయింది. అయితే మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ అరెస్టును, ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీని సమర్ధించుకోవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఆ పనిని ఆయన చేయగలిగినంత అస్తవ్యస్తం చేస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకే కంగారుపడితే ఎలా? ముందు ముందు జగన్ కూడా ఈ కేసులో కటకటాల వెనక్కు వెడతారు.. అంటే ఆయన పార్టీ క్యాడర్ కు సంకేతాలిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి తొలి ఏడాది ఎవరినైనా అరెస్టు చేయడం సులువే.. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
అదే జగన్ అన్ని ఆధారాలూ సేకరించిన తరువాత తన అధికారం చివరి దశలో చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. అయితే ఇక్కడ సజ్జల ఉద్దేశపూర్వకంగా విస్మరించిన సంగతేంటంటే.. జగన్ ప్రభుత్వం అన్ని ఆధారాలూ సేకరించి చంద్రబాబునున అరెస్టు చేసినట్లైతే.. ఆ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంలో విఫలం ఎందుకైంది? అన్న ప్రశ్నకు సమాధానం. మొత్తంగా నష్టనివారణ అంటూ మీడియా ముందుకు అదీ జగన్ అనుకూల మీడియా ముందుకు వచ్చి సజ్జల చెప్పిందేమిటంటే.. జగన్ మద్యం కేసులో అరెస్టు కాబోతున్నారు అనే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-did-sajjala-say-39-202778.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.