నిర్బంధ కాలాన్ని నమోదు చేసిన పదమూడేళ్ళ అమ్మాయి కధ

Publish Date:Apr 11, 2020

Advertisement

దాదాపుగా అందరమూ ఒక గూటిలో ఉండగలుగుతున్నాం. తింటూ, కాసేపు కునుకు తీస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, కరోన భయంలో మరింత దైవ చింతనలో ఉంటూ, రేపటి గురించిన చింతతో మొత్తానికి గడిపేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి, చవకగా డేటా కూడా దొరికింది కాబట్టి ఏదో ఆసక్తి కలిగించేదో చూసే/చేసే అవకాశం దొరికింది. 
కానీ కాలం గడిచే కొద్దీ ఒక విసుగు... ఎప్పుడు బయటపడతామా అని ఆలోచనలు. కానీ ఒక అనివార్యమైన సుదీర్ఘ కాలం ఇప్పటిలా 6 గంటల నుంచి 9 గంటల వరకు మనకు కావలసినవి దొరికేల కాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని ఉహించండి. భయమేస్తోంది కదా. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దాదాపుగా యూరోప్  అంతటా హిట్లర్ నాజీ సైన్యం యూదులపై జరిపిన జాతి హననము ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక విషాద ఘట్టం. 

ఈ నేపద్యంలో ఒక పదమూడేళ్ల అమ్మాయి తన కుటుంబంతో సహా దాదాపుగా రెండేళ్ల పైబడి హిట్లర్ రహస్య సైనిక విభాగం గెస్తపో నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని నమోదు చేసుకున్న ఒక సాక్ష్యం "the diary of Anne frank".
 
రెండేళ్లపాటు కుటుంబమంతా ఒక చీకటి గుహ లాంటి ఆఫీస్ క్రింద భాగాన్ని మరో కుటుంబంతో కలిసి జీవించడాన్ని ఉహించండి. విభిన్న మనస్తత్వాలు కల్గిన వ్యక్తులు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుందన్న స్పృహతో సేకరించి పెట్టుకున్న అతి తక్కువ ఆహార పదార్ధాలు తో చీమ చిటుక్కుమంటే భయం, లోగొంతుకతో తప్ప మాట్లాడుకోలేని పరిస్థితుల్లో అజ్ఞాతంలో గడపడాన్ని ఉహించండి. ఇంత దుర్భర పరిస్థితుల్లో తమకు తాము మంచే జరుగుతుందన్న ఆశను కోల్పోకుండా రోజులను గడపడాన్ని పదమూడేళ్ళ అమ్మాయి తన డైరీ "kitty" తో చెప్పుకుంటూ రాసుకుంది. 

 

 

రెండేళ్ళ తర్వాత అందరూ పట్టుబడేంతవరకు అన్నే ఫ్రాంక్ రాసుకున్న డైరీ అప్పటి జాతి హనన పరిస్థితులకు సాక్ష్యంగా నిలిచింది.  దురదృష్టవశాత్తు అన్నే ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మినహా మరెవ్వరూ హిట్లర్ నుంచి తప్పించుకోలేక పోయారు. అజ్ఞాతంలో ఉన్న వీళ్ళను నిర్బంధంలోకి తీసుకునేప్పుడు ఏదో పనికిమాలిన పేపర్లుగా భావించి అదొక సాక్ష్యమే కాదన్నట్లుగా వదిలేసిన డైరీ ఒక గొప్ప సాక్ష్యంగా చరిత్రలో మిగిలింది. అన్నే ఫ్రాంక్ తండ్రి విడుదలైన తర్వాత ఈ డైరీ ని ప్రచురించడం జరిగింది. తర్వాత అనేక ప్రచురణలు పొందడం, ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువాదం పొందడం, సినిమాలుగానూ, టెలిఫిల్మ్స్ గానూ రావడం జరిగింది. 

ఈ స్వీయ నిర్బంధ కాలంలో ఈ పుస్తకాన్ని చదవడం ఒక ఓదార్పు మనకు. ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకోవడం లాంటిది. ముఖ్యంగా పడమూడేళ్ళ అమ్మాయి ఆలోచనల్లోంచి ఒక సంక్షోభ కాలాన్ని చూడడం, వాళ్ల కలలు, సమస్యలు, పరిణితి అర్ధం చేసుకోడం నిజంగా బాగుంటుంది.

By
en-us Political News

  
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.