ఏమి చెబుతున్నాయి హక్కులు??

Publish Date:Dec 11, 2021

Advertisement

 Human rights. ప్రస్తుత ప్రపంచంలో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన భారతదేశంలో చిన్న నుండి పెద్ద వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు, ఇంట్లో మనుషుల నుండి సమాజంలో కూటములైన సంఘాలు, సంస్థలు వాటిలో పనిచేసే వారి వరకు. ఇలా సకల ప్రజానీకం ఎక్కువగా మాట్లాడే పదం, ఉపయోగించే పదం "హక్కు"

మనిషికి తన జీవితంలో కొన్ని స్వేచ్చలు ఉన్నాయి వాటిని పొందడానికి, ఆ స్వేచ్ఛకు తగ్గట్టు బతకడానికి ఐక్యరాజ్యసమితి తీర్మానం చేపట్టి ఆమోదించినవే మానవ హక్కులు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులను పొందే సౌలభ్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది, ఉండాలి కూడా. అయితే ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులు ఏమిటి?? మనం డిమాండ్ చేస్తున్నది ఏమిటి?? వీటిని గూర్చి ఆలోచిస్తే 

జాతి, మత, లింగ, కుల, వర్ణ, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏ విధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కానీ మన సమాజంలో ప్రతి మనిషితో మాట్లాడే ముందు కచ్చితంగా కులం, మతం చూసుకుంటూ ఉంటారు. వీటి ప్రస్తావన లేకుండా వాటి గురించి అసలు ఆలోచించకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువని చెప్పవచ్చు. పరోక్షంగా ఎందరో చర్యల ద్వారా ఈ రకమైన వివక్షకు గురవుతూనే ఉంటారు. ఇక ఈ సమాజంలో ప్రస్తుతం  ఉన్న అతి పెద్ద సమస్య రాజకీయ కారణాలు. చెప్పుకోవడానికి విచిత్రంగా ఉన్నా సాధారణ పౌరులు ఈ రాజకీయ వర్గాలు మధ్య నలిగిపోతూ ఉంటారు. 

చిత్రహింసలు మరియు క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రహింసలు మరియు క్రూరత్వానికి బలి అవుతున్న వాళ్లలో ఆడవాళ్లు అధికశాతం మంది, తరువాత పిల్లలు, వృద్ధులు ఉన్నారు. కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా వీఎటి బారిన పడుతున్నారు. చేదైన నిజం ఏమిటంటే చిత్రహింసలు, క్రూరత్వం కుటుంబ సభ్యులనుండే ఇవన్నీ ఎదురవ్వడం. వ్యక్తిగత దాడులు, ఆర్థికపరమైన కారణాలు, కక్షలు, కుట్రలు వంటి వాటిలో బాగా తెలిసినవారి నుండి, లేదా కుటుంబ సభ్యుల నుండి పై సమస్యలు ఎదుర్కొంటారు.

వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. బానిసత్వం మన భారతదేశంలో వేళ్లూనుకుపోయింది. ఎంతగా అంటే పక్క దేశాలు చెప్పినదానికి తలలు  ఊపుతూ వాగ్దానాలు చేసి దేశంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకునే స్థాయిలో. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎన్నో ఒప్పందాలు, వాటి రహస్యాలు సామాన్య ప్రజలకె కాదు ధనికులకు కూడా తెలియదు సరిగ్గా.  ఒక కుటుంబంలో ఆడపిల్లను ఎలాగైతే బాధ్యత, పరువు అనే పేరు కింద స్వేచ్ఛను తుంచి బానిసగా ఉంచుతారో అలాంటివి సమాజంలో, జీతీయం, అంతర్జాతీయ స్థాయిలలో కూడా జరుగుతుంటాయి. ఆర్థిక, విద్య, వైద్య రంగాలలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. 

నిర్బంధించబడకుండా ఉండే హక్కు మానవ హక్కుగా పేర్కొన్నారు. నిర్బంధం అంటే కట్టడి చేయడం. సరైన కారణం లేకుండా ఒక మనిషి స్వేచ్ఛను హరించడం, ఆ మనిషిని అన్ని రకాలుగా అన్నిటికీ దూరం చేయడం. ఆంక్షలు విధించడం, ఇష్టాలకు గౌరవం ఇవ్వకుండా ఉండటం. ప్రస్తుత సమాజంలో ఈ రకమైన నిర్బంధం ఆడవాళ్ళ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ చాలా జరుగుతున్నాయి. 

పక్షపాతం లేకుండా ఉండటం. అనేది మానవ హక్కు కానీ ఇంటా బయట ఈ పక్షపాత ధోరణి పుష్కలంగా కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్లలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటే అక్కడ పక్షపాత ధోరణి కచ్చితంగా ఉంటుంది. లింగవివక్షలో మెండుగా ఉండే ఈ పక్షపాతం వల్ల ఎంతో నష్టపోతారు. ఇషి మాత్రమే కాకుండా పేద,  ధనిక వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఇలా అన్ని వర్గాలలో పక్షపాతం ఉంటుంది.

పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా జీవించే హక్కు, సామాజిక భద్రతాహక్కు, భావ స్వాతంత్య్రహక్కు, విద్యాహక్కు, పిల్లలు ఆడుకొనే హక్కు, ప్రజాస్వామ్య హక్కు, కాపీరైటు హక్కు, జాతీయత హక్కు, ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి.

అయితే హక్కుల పేరుతో వీటిని ఎందసరో దుర్వినియోగం చేస్తున్నారు కూడ. ముఖ్యంగా యువత స్వేచ్ఛ అనే హక్కును, జీవించే హక్కును కాస్త అడ్డదారిలో వెల్తూ అది నా హక్కు అని, స్వేచ్ఛగా ఉండటంలో తప్పులేదని అతిగా వాదిస్తుంది.  

హక్కుల ప్రాముఖ్యత తెలుసుకుని వాటిని సరైన దిశలో అనుసరిస్తే అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది.

 

◆ వెంకటేష్ పువ్వాడ

 

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.