విజయసాయి కుమార్తెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? జీవీఎంసీని నిలదీసిన హైకోర్టు

Publish Date:Oct 24, 2024

Advertisement

విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డిపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించిన నేహారెడ్డి ఇతరులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు నిలదీసింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను తుంగలోకి తొక్కి భీమిలీ బీచ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ కట్టడాలను నిర్మించారనీ, ఈ విషయంలో చర్యలు తీసుకోకుండా జీవీఎమ్ సీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ జనసేన కార్పొరేట్ మూర్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. నేహారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని అధికారులను ప్రశ్నించింది. ఈ విషయమై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

ఈ కేసు విచారణ బుధవారం (అక్టోబర్ 24)న జరిగింది. ఆ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది.. అక్రమకట్టడాలను పూర్తిగా కూల్చలేదనీ, కేవలం ప్రహారి గోడను మాత్రమే కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ చట్టం ప్రకారం కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారు శిక్షార్హులని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇందుకు స్పందనగా జీవీఎంసీ తరఫు న్యాయవాది కోర్టు ఆదేశాల మేరకు అక్రమకట్టడాలన్నిటినీ కూల్చివేసినట్లు తెలిపారు. దీంతో కోర్టు నేహారెడ్డి తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైందా అని ఆరా తీసింది. సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.