విండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత.!

Publish Date:Jul 17, 2026

Advertisement

క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుది. క్రికెట్ దిగ్గజం, వెస్టిండీస్ మాజీ కెప్టెన్  సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు.  వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌తోనూ, బౌలింగ్‌తోనూ మైదానంలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న గ్యారీ సోబర్స్..  క్రికెట్ ఆటలో ఆల్‌రౌండర్ అనే పదానికి  నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. 

  ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టించే సోబర్స్, ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మొట్టమొదటి ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. 1968లో స్వాన్సీలోని  సెయింట్ హెలెన్స్ మైదానంలో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆయన ఈ అరుదైన ఘనత సాధించారు. ఆ సమయంలో నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, గ్లామోర్గాన్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ రికార్డును నెలకొల్పారు.  

బార్బడోస్ లో జన్మించిన సోబర్స్ చిన్నతనం నుంచే క్రికెట్ లో అసాధారణమైన ప్రతిభను కనబరిచారు. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే  ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ఆ మరుసటి ఏడాదే.. అంటే 16 ఏళ్ల వయస్సులోనే  వెస్టిండీస్ జాతీయ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించారు. 1958లో పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో   అజేయంగా 365 పరుగులు సాధించి   ప్రపంచ రికార్డును నెలకొల్పారు.  ఈ రికార్డును దాదాపు 36 సంవత్సరాల పాటు ఎవరూ అధిగమించలేకపోయారు. చివరకు 1994లో వెస్టిండీస్‌కే చెందిన మరో దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ఈ మైలురాయిని అధిగమించారు.

తన సుదీర్ఘమైన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో విజయాలను నమోదు చేసిన సోబర్స్, తన 38వ ఏట.. 1974లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.     . తన క్రికెట్  కెరీర్‌లో మొత్తం 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సోబర్స్ , 57.78 సగటుతో 8 వేల 032 పరుగులు సాధించారు. బౌలింగ్‌లోనూ అదే స్థాయి నిలకడను ప్రదర్శిస్తూ 34.03 సగటుతో 235 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే, ఇప్పటికీ నాలుగో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన ఆటగాడిగా ఆయన రికార్డు భద్రంగా ఉంది.  

సోబర్స్ మరణం పట్ల  క్రీడా ప్రముఖులు, మాజీ క్రికెటర్లు  తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోబర్స్ ఆట తీరు, మైదానంలో   కనబరిచిన హుందాతనం తరతరాల క్రికెటర్లపై చెరగని ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. 

Sir Garfield Sobers Death, West Indies Cricket Legend, Greatest Cricket All Rounder, Gary Sobers Record Six Sixes

By
en-us Political News

  
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జూలై 18 నాటి న్యూయార్క్ టైమ్స్ కనెక్షన్స్ పజిల్ గేమ్ 1133 హింట్స్ మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. మీ విన్నింగ్ స్ట్రీక్‌ను సులభంగా కాపాడుకోండి.
అమెరికాలో ఏఐ కంపెనీల సంపద పంపిణీపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. కంపెనీల స్టాక్‌లో 50 శాతం వాటాను పబ్లిక్ వెల్త్ ఫండ్‌కు బదిలీ చేయాలనే ప్రతిపాదనకు 69% మంది ప్రజలు మద్దతు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సబ్‌స్క్రైబర్లలో భారీ మార్పు! మొదటి సీజన్ తర్వాత 70 శాతానికి పైగా వ్యూయర్స్ షోలను ఎందుకు వదిలేస్తున్నారో బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
భారతదేశంలో యూపీఐ UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ MDR ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.2,000 దాటిన లావాదేవీలపై గరిష్టంగా 0.5 శాతం కంటే తక్కువ ఛార్జీ విధించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మరియు దీనివల్ల ఎవరిపై ప్రభావం పడుతుందో ఇక్కడ చదవండి.
ఆసుపత్రిలో చేరినప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సులభంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా సెటిల్ అవ్వడానికి అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ వరకు పాటించాల్సిన 10 అద్భుతమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా, టీసీఎస్ అద్భుత ఫలితాలు మరియు బ్యాంకింగ్ షేర్ల భారీ కొనుగోళ్ల వల్ల శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీల పూర్తి అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా, టీసీఎస్ అద్భుత ఫలితాలు మరియు బ్యాంకింగ్ షేర్ల భారీ కొనుగోళ్ల వల్ల శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీల పూర్తి అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
గత 20 ఏళ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని 22 రెట్లు పెంచి, అదిరిపోయే రాబడులను అందించిన 7 అద్భుతమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్, మిడ్, ఫ్లెక్సీ క్యాప్) వివరాలు మీకోసం.
ఫిఫా వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బార్లు, క్లబ్బుల వేళలను అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున 4:30 గంటల వరకు పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.