Publish Date:Aug 16, 2022
కర్నాటకలో బొమ్మై ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో తెలియజేసే ఓ ఆడియో లీక్ అయ్యింది. కర్నాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారానికి తెరతీశాయి. విపక్ష కాంగ్రెస్ పార్టీకి అనుకోని అవకాశంగా అందివచ్చాయి.
అంతేనా ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసేలా వ్యాఖ్యలు చేసిన మధుస్వామి రాజీనామాను డిమాండ్ చేస్తూ సహచర మంత్రులో ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ఎంత కప్పిపుచ్చుదామని చేసినా ముధుస్వామి వ్యాఖ్యలపై దుమరం రేగుతూనే ఉంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. చెన్నపట్నకు చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్ మంత్రి మునుస్వామికి ఫోన్ చేసి రైతులకు సంబంధించిన అంశంపై కో-ఆపరేటివ్ బ్యాంకుపై ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదుపై మంత్రి సమాధానమిస్తూ ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం అని సమాధాపమిచ్చారు. అందుకు సంబంధించిన ఆడియో లీకై ప్రభుత్వాన్ని ఇక్కట్లలోకి నెట్టింది. దీనిపై మరో మంత్రి మునిరత్న మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం చేసే వ్యక్తులు కేబినెట్ లో ఉండాల్సిన అవసరం లేదని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష కాంగ్రెస్ అయితే కర్నాటకలో బీజేపీ సర్కార్ ప్రజలకు కాకుండా ఆర్ఎస్ఎస్ కు జవాబుదారీగా ఉంటోందని విమర్శలు గుప్పించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/we-are-not-running-government-just-managing-25-142058.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.