జ్ఞాపకాలు బాధపెడుతున్నాయా? ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది..!

Publish Date:Dec 4, 2025

Advertisement

జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు,  మనుషులు గుర్తుండిపోవడం.   ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు,  జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు.  చాలా నరకం అనుభవిస్తాడు.  ఒంటరితనం ఫీలవుతాడు. కానీ  ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.  దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

అంగీకారం..

బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి.  ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా,  నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే..  దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి.  ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు.

షేరింగ్..

జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు,  అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు.

వ్యక్తీకరణ..

బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా  భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి.

ధ్యానం, యోగ..

ధ్యానం,  యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది.

బాధకు సమయం ఇవ్వవద్దు..

బిజీగా ఉండటం,  కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం,  ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం  వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది.  కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి.

జీవనశైలి..

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు.

                                     *రూపశ్రీ.
 

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.