కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి వ్యక్తుల చేతుల్లో పెడితే నాశనమే..!

Publish Date:Sep 12, 2025

Advertisement


డబ్బు నేటికాలంలో చాలా అవసరం. డబ్బు లేకపోతే ఏ పని జరగదు.  ఆఖరికి నీళ్లు కూడా డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం.  డబ్బు సంపాదన కోసం చాలా కష్టపడతాం.  రాత్రి, పగలు కష్టపడి మరీ డబ్బు సంపాదిస్తుంటారు.  చాలా వరకు డబ్బు సంపాదనలో ప్రస్తుత అవసరాల గురించే కాకుండా భవిష్యత్తు అవసరాలకు,  భవిష్యత్తు పరిస్థితులకు కూడా భాగం ఉంటుంది.  అయితే డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బును జాగ్రత్త చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం.  కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాగంటే అలా.. ఎవరి చేతిలో అంటే వారి చేతిలో పెట్టకూడదు. దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనం అవుతుంది.  కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  ఇంతకీ డబ్బును ఎలాంటి వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు? తెలుసుకుంటే..

మోసం చేసే స్నేహితులు..

కొంతమందికి మోసం చేయడం అనే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎంత బాగున్నా.. వారికి ఏ ఇబ్బందులు లేకపోయినా సరే.. అప్పు పేరుతో లేక బదులు పేరుతో లేక వడ్డీ ఆశ చూపి డబ్బు తీసుకుని ఆ తర్వాత డబ్బు ఎగ్గొట్టేవారు ఉంటారు. ఇలాంటి అనుభవాలు ఒకటి రెండు సార్లు జరిగినా సరే.. వడ్డీ వస్తుందనే ఆశతోనో లేక ఎదుటి వ్యక్తులు మాట్లేడే మాట చాకచక్యంతోనో వారిని పదే పదే నమ్మేస్తూ ఉంటారు.  అలాంటి వారి చేతిలో డబ్బు పెడితే ఆ డబ్బు, మన కష్టం రెండూ నాశనం అవుతాయి.

దురాశతో ఉండే పెట్టుబడిదారులు..

కొంతమంది ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చూపించి  డబ్బును తీసుకుంటారు. వడ్డీ ఎక్కువ వస్తుందనో.. ఏవైనా ఆఫర్ లు ఉంటాయనో.. తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం తిరిగి ఇస్తారనో చెప్పి ప్రజల నుండి డబ్బు తీసుకుంచారు.  పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేయడం ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టమని అడుగుతుంటారు. పైగా తాము చాలా పేరొందిన వారమని,  తమకు గొప్ప వ్యక్తులు తెలుసునని చెప్పుకుంటారు. ఇలాంటివారు పెద్ద మొత్తంలో తమ చేతికి డబ్బు అందిన వెంటనే మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడతారు.

కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు..

కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు స్వార్థపరులని అర్థం. ఇలాంటివారు ఎప్పుడూ తమ గురించి చూసుకుంటారు. తమ పని జరిగడం కోసం ఎన్ని మాటలైనా చెప్తారు. తాము తప్ప సమస్యలు ఎవ్వరూ ఫేస్ చేయడం లేదనే ఫీలింగ్ లో ఉంటారు.  తమ బాధను ఎంతో క్రిటికల్ గా చెబుతారు.  వీరి మాటలలో ఎమోషన్ ను చూసి చాలామంది పాపం అనే ఫీలింగ్ తో డబ్బు ఇచ్చేస్తుంటారు.  కానీ ఇలాంటివారు తమ అవసరం తీరిపోగానే తర్వాత ఏమీ మాట్లాడరు.  కనీసం అందుబాటులోకి కూడా రారు.  అందుకే ఇలా తమ గురించి మాత్రమే చెబుతూ.. ఎదుటివారి పరిస్థితి అర్థం చేసుకోకుండా డబ్బు గురించి అడిగే వారి చేతిలో ఎప్పుడూ డబ్బు పెట్టకూడదు.

కష్టపడని వారు..

కొందరు కష్టపడరు..కానీ అవసరానికి డబ్బు అడుగుతూ ఉంటారు. తమకు ఎలాంటి ఉద్యోగం రాకపోవడానికి కారణం చుట్టూ ఉన్న సమాజం, తన కుటుంబం అంటూ కారణాలు చెబుతూ ఉంటారు. ఇలాంటివారు కేవలం  సులువుగా డబ్బు చేతికి వస్తే సుఖపడిపోదాం అనే ఆలోచనతో ఉంటారు. వీరికి డబ్బు విలువ, కష్టం విలువ అస్సలు తెలియదు. ఇలాంటివారు ఇతరులకు డబ్బు ఇవ్వకుండా మోసం చేసినా.. అదేం పెద్ద విషయం కాదని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి కష్టం విలువ తెలియకుండా జులాయిగా ఉంటూ,  సోమరితనంతో ఉండేవారి చేతిలో డబ్బు పెట్టకూడదు.

                        *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.