కడియం ఓట్లకు గండికొడుతున్న కొడవలి

Publish Date:Mar 13, 2012

Advertisement

వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేస్తున్న కడియం శ్రీహరికి సిపిఎం అభ్యర్ధి పెద్ద ఇబ్బందిగా మారారు. ఈ ఎన్నికల్లో సిపిఎం తరపున పోటీచేస్తున్న ఇలిషన్ గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినప్పటికీ ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయో ఆ మేరకు కడియం శ్రీహరి ఓటుబ్యాంక్ కు గండిపడుతుందని తెలుగుదేశం నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఇక్కడ రంగంలో ఉన్నాయి. ఈసారి సిపిఎం ఒంటరిగా రంగంలోకి దిగింది. తమ అభ్యర్ధికి 10వేల వరకు ఓట్లు వస్తాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగయ్య అంటున్నారు. నిజంగా ఇన్ని ఓట్లు ఇలిషన్ కు వస్తే టిడిపి అభ్యర్ధి కడియం శ్రీహరికి పెద్ద దెబ్బతగిలినట్లే. 2009 ఎన్నికల సమయంలో సిపిఎం, తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే వీరి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా స్టేషన్ ఘన్ పూర్ లో సిపిఎం అభ్యర్ధి నలిగంటి రత్నమాల పోటీచేశారు. ఆమెకు అప్పట్లో సుమారు 5వేల ఓట్లు వచ్చాయి. మహాకూటమిలో విభేదాలవల్ల సిపిఎం పోటీచేయడంతో టిడిపి అభ్యర్ధి కడియం శ్రీహరి బాగా నష్టపోయాడు. మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుందేమోనని టిడిపి నాయకులు భయపడుతున్నారు.

By
en-us Political News

  
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.