రణమా.. శరణమా.. సమయం లేదు మిత్రమా!

Publish Date:May 11, 2025

Advertisement

పాకిస్థాన్ ను ఇండియా అల్టిమేటమ్
యుద్ధ విరమణకు భారత్ షరతులు ఏంటో తెలుసా?

భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాక్ దేవులాడుకుని, భారత్ మానవతా  దృక్పథంతో అందుకు అంగీకరించి రువాత పాకిస్థాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాక్ కు ఇక అన్ని దారులూ మూసుకుపోయాయి. అలుంగుటయే ఎరుంగని.. అన్నట్లుగా ఇంత కాలం శాంతి మంత్రం జపిస్తూ వచ్చిన వచ్చిన ఇండియా కన్నెర్ర చేసింది. దీంతో పాకిస్థాన్ ను పూర్తిగా కాళ్ల  బేరానికి తెచ్చుకునేందుకు రెడీ అయిపోయింది.  ఈ నేపథ్యంలోనే సోమవారం  (మే11) భారత్, పాకిస్థాన్ డీజీఎంవోల మధ్య హాట్ లైన్ లో జరగనున్న  చర్చల నేపథ్యంలో ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యా శాంతి, యుద్ధ విరమణ విషయంలో విధించాల్సిన షరతులపై వారికి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.

ఆ షరతులేమిటన్నది తెలియగానే భారత్ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం  అవుతున్నాయి. అసలు రెండు రోజుల కిందట కాల్పుల విరమణ ఒప్పందం  కోసం పాక్ కాళ్ల బేరానికి వచ్చినప్పుడే ఈ షరతులు విధించి ఉండాల్సిందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్లుగా.. పాక్ కుత్సిత బుద్ధిని తానే బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టుకునే దాకా ఆగి మోడీ కీలెరిగి వాత పెట్టిన చందంగా ఈ ప్రతిపాదనలను  తీసుకువచ్చారనీ, ఈ షరతులను అంగీకరిస్తేనే పాక్ లో సంధి అన్న  స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా త్రివిధ దళాధిపతులతో సమావేశంలో ఆయన ఆదేశించారు. ఇంతకీ ఆ షరతులేమిటంటే..   పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడి పర్యాటకులని హత్య చేసిన ముగ్గురు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలన్నది మొదటి షరతు కాగా,  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ని బేషరతుగా భారత్‌కు  అప్పగించాలన్నది రెండో షరతు. ఇరు దేశాల మధ్యా శాంతి, సంధి  కుదరాలంటే ఈ షరతులకు అంగీకరించడం వినా మరో మార్గం లేదని ఆ  దేశానికి విస్పష్టంగా చెప్పాలని మోడీ త్రివిధ దళాధిపతుల సమావేశంలో చెప్పారు.

అయితే ఈ రెండు షరతులకు పాకిస్థాన్ అంగీకరించే అవకాశాలు అంతంతమాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. భారత్ విధించనున్న రెండు షరతులలో మొదటిదైన ఉగ్రవాదుల అప్పగింత విషయానికి వస్తే..  పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, వారిని భారత్  లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తోందన్న భారత్ ఆరోపణలు అక్షర సత్యాలని   స్వయంగా అంగీకరించి, ధృవీకరించినట్లవుతుంది.  ఇక భారత్‌ నుంచి ఎలాగైనా మొత్తం కశ్మీర్‌ను దక్కించుకోవాలన్న దుర్భుద్ధితో దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న   పాకిస్థాన్‌, ఇప్పుడు తన అధీనంలో ఉన్న కశ్మీర్‌ని భారత్‌కి అప్పగించడానికి అంగీకరిస్తే.. ఇన్ని దశాబ్దాలుగా పాక్ వాదన అంతా తప్పుల తడకగా తేలిపోతుంది. అంతర్జాతీయ వేదికలపై తాను చేసిన వాదనలన్నీ తప్పని స్వయంగా  అంగీకరించినట్లు అవుతుంది. అన్నిటికీ మించి సొంత ప్రజలనే మోసం  చేసినట్లు పాక్ పాలకులు,  సైన్యం అంగీకరించినట్లు అవుతుంది.

ఆ  కారణంగానే పాకిస్థాన్ అందుకు అంగీకరించే అవకాశాలు ఇసుమంతైనా లేవని  అంటున్నారు. అదే సమయంలో భారత్ తో సై అని యుద్ధానికి దిగే సత్తా  కూడా ఆ దేశానికి లేదు. యుద్ధమే కనుక జరిగితే.. రోజుల వ్యవధిలోనే పాక్  పనైపోతుంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కోల్పోవడము కాకుండా, పాకిస్థాన్  అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుంది.  ఈ పరిస్థితుల్లో భారత్ పాక్ కు రణమా..  శరణమా.. సమయం లేదు మిత్రమా అంటూ ఇవ్వబోయే అల్టిమేటమ్ కు పాక్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సిందే.  

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.