మాటల గారడీ చేస్తున్నఉండవల్లి

Publish Date:Jan 29, 2014

Advertisement

 

నేడు రాజకీయాలలో మనుగడ సాధించాలంటే అంగబలం, అర్ధ బలంతోబాటు మంచి మాటకారితనం కూడా ఉంటే ఇక వారు పాడిందే పాట, చెప్పిందే వేదంగా చెలామణి అవుతుంది. ఒక న్యాయవాదికి మంచి మాటకారితనం ఉండి అతను రాజకీయాలలోకి ప్రవేశిస్తే ఇక చెప్పేదేముంది?

 

రాజమండ్రి యంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కోవలోకే వస్తారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొన్నందున ఆయన పార్టీకి, పదవికీ కూడా రాజినామా చేసారు. తన నిబద్దతపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు వచ్చేఎన్నికలలో తాను పోటీ చేయబోనని ప్రకటించారు కూడా. అయితే, త్వరలో జరుగబోయే రాజ్యసభ ఎన్నికలకి ఆయన పేరు అటు పార్టీ తరపున, ఇటు సీమాంధ్ర తిరుగుబాటు కాంగ్రెస్ నేతల తరపున కూడా పరిశీలనలోకి రావడం విచిత్రమే!

 

నిన్నఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన కేవీపీ, సుబ్బిరామి రెడ్డిలను వెనకేసుకు వచ్చిన తీరు ఆయన మాటకారితనాన్ని మరోసారి బయటపెట్టింది. “కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేఖిస్తున్న మీరు, పార్టీ నిలబెడుతున్న కేవీపీ, సుబ్బిరామి రెడ్డిలకు మద్దతు ఇస్తారా? ఓడించమని పిలుపునిస్తారా?” అనే మీడియా ప్రశ్నకు జవాబు చెపుతూ, “కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖించడం, రాష్ట్ర విభజన చేయాలని అది తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేఖించడం రెండూ రెండు వేర్వేరు అంశాలు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించిన వారందరూ పార్టీ అభ్యర్ధులను వ్యతిరేఖించవలసిన అవసరం లేదు. అలాగే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న వారందరూ పార్టీని వీడిపోవలసిన అవసరం లేదు కూడా. ఒకవేళ పార్టీ విభజనవాదులయిన తెలంగాణా వ్యక్తులను ఎవరినయినా పోటీలో నిలబెట్టి, వారికి మద్దతు ఈయమని మమ్మల్ని కోరినట్లయితే తప్పకుండా వారిని ఓడించవలసి ఉంటుంది. కానీ కేవీపీ, సుబ్బిరామి రెడ్డి ఇద్దరూ కూడా పూర్తి సమైక్యవాదులే. కేవీపీ స్వయంగా ముందుండి సమైక్యపోరాటం చేసారు. అదేవిధంగా సుబ్బిరామి రెడ్డి కూడా సమైక్యవాదే! ఆయన తన వ్యాపార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని ఆ మాట గట్టిగా పైకి చెప్పలేకపోతున్నారు, కానీ ఆయన చేయవలసిన ప్రయత్నాలు ఆయనా చేసారు. అందువల్ల వీరిరువురినీ పార్టీ నిలబెట్టిన కారణంగా వ్యతిరేఖించనవసరం లేదు,” అని స్పష్టం చేసారు.

 

“మరయితే వారిపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీగా దిగిన చైతన్యరాజుకి మీరు మద్దతు ఇస్తారా?” అనే ప్రశ్నకు బదులిస్తూ, “నిజానికి మా యంపీల కంటే శాసనసభ్యులే రాజకీయాలలో ఆరితేరినవారు. ఎందుకంటే వారు అటు ప్రజలతో, ఇటు పార్టీతో నిత్యం మంచి సంబందాలు కలిగి ఉంటారు. వారు ఎవరికి మద్దతు ఈయాలో మేము చెప్పనవసరం లేదు,” అని ఉండవల్లి జవాబు చెప్పడం ఆయన మాటకారితనానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది.

 

కాంగ్రెస్ అధిష్టానం చాలా తెలివిగా ఎంపికచేసిన అభ్యర్ధులను ఎవరూ కాదనలేని పరిస్థితి కల్పించడమే కాదు, వారి ద్వారా ఉండవల్లి వంటి అసమ్మతి నేతలను కూడా దారిలోకి తెచ్చుకోగలిగింది. అందుకే పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులకు ముఖ్యమంత్రి మొదలు ఉండవల్లివరకు అందరూ కూడా కాదనకుండా మద్దతు ఈయవలసి వస్తోంది. దీనినే కర్ర విరగకుండా, పాము చావకుండా కధ నడిపించడం అంటారేమో! ప్రస్తుతం ముఖ్యమంత్రి, బొత్స ఇరువురూ కలిసి తిరుగుబాటు అభ్యర్ధులను వారికి మద్దతు ఇస్తున్న వారిని బుజ్జగించే ప్రయత్నాలలో ఉన్నట్లు తాజా సమాచారం. కాంగ్రెస్ తెలివితేటలకి ఇంత కంటే గొప్ప ఉదాహరణ ఏమి కావాలి?

By
en-us Political News

  
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.