Publish Date:Feb 10, 2025
స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలకు చెల్లు చీటీ పాడే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తున్నది. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ. లోకల్ బాడీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు తావులేదని చెబుతూ ఎన్నికలు జరిగి తీరాల్సిందేనంటూ ఓ నివేదిక రూపొందించింది. పంచాయతీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక నామినేషన్ దాఖలైన స్థానానికి కూడా ఎన్నికలు జరగాలనీ, అలాంటి స్థానాల్లో నోటా పోటీదారుగా ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమౌతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన సంచలనం సృష్టిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ మందబలంతో ప్రోత్సాహకాల పేరిట ఏకగ్రీవాలకు తెరతీయడంతో స్థానిక ప్రభుత్వం (లోకల్ గవర్నెన్స్) లక్ష్యానికి గండిపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే స్థానిక ఎన్నికలు అనగానే మెజారిటీ స్థానాలలో ఏకగ్రీవాలే ఉంటాయి. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలవైపే పార్టీలు మొగ్గు చూపుతాయి. సహజంగానే ఈ ఏకగ్రీవాలలో అత్యధికం అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో 16 శాతం గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయంటే పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. అ
వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్ని కల సంఘం ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసింది. రైట్ నాట్ టు ఓట్’ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే నోటాను ఎంచుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల నోటాను ఎంచుకునే హక్కును ఓటర్ కోల్పోతున్నాడు. దీనిపై ఫోరం ఫర్గుడ్గవర్నెన్స్ ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ప్రతి పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటరుకు కల్పించాలని, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ లేఖలో కోరింది. అందుకే ఒక్క నామినేషన్వచ్చినా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్మాత్రమే మిగిలినా.. ఏకగ్రీవానికి తావులేకుండా నోటాను అభ్యర్థిగా ఉంచి, ఓటింగ్ పెట్టాలన్నది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్. దీనికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఒక నివేదిక తయారు చేసింది. ఈ నివేదికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. ఒక వేళ రాజకీయ పార్టీలు ఇందుకు అనుమతి ఇచ్చినా, రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వర్గాలకు పంచాయతీల ఏకగ్రీవానికి ప్రయత్నించాలంటూ స్పష్టమైన సూచనలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/voting-must-in-local-bodies-elections-25-192647.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.