ఓట‌రా మేలుకో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని కాపాడుకో!

Publish Date:May 9, 2024

Advertisement

అభివృద్ధి జ‌ర‌గాలంటే ఆయుధం ఓటు.. ప్ర‌జా పాల‌న సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్ర‌భుత్వాల‌ను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. క‌క్ష‌పూరిత పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వం మెడ‌లు వంచాల‌న్నా ఆయుధం ఓటే.. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మ‌న చేతుల్లోనే ఉంది. మన‌ది ఒక్క ఓటే క‌దా వెయ్య‌క‌పోతే ఏమ‌వుతుందిలే అనుకుంటే అది పొర‌పాటే. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఓట‌ర్లు చేసిన ఆ పొర‌పాటే ఇప్పుడు వారి జీవితాల‌కు శాపంగా మారింది. రాజ‌ధాని లేని రాష్ట్రంగా చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకోవ‌డంతోపాటు.. గంజాయికి నిల‌యంగా మారింది. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఏపీ మారింది, అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, ఉన్న కంపెనీల‌ను త‌రిమేసిన రాష్ట్రంగా.. మొత్తంగా మ‌రో శ్రీ‌ల‌కం దేశంగా మారేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అందుకు కార‌ణం ఏపీ ఓట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే. ఏపీలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింది. అభివృద్ధి లేదు, రోడ్లు వేయ‌లేదు, ఉద్యోగాలు క‌ల్పించ‌లేదు, క‌నీస సౌక‌ర్యాలు లేవు.. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు మాత్రం పెద్దెత్తున జ‌రిగాయి. గొంతెత్తి అడిగిన వారు  జైళ్ల‌కు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్‌ న‌మోదైంది. దాదాపు 20శాతం మంది ఓట‌ర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వీరిలో 10శాతం మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ముందుకు వ‌చ్చినా ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండేవారు కాక‌పోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలకే ప‌రిమితం కావ‌డంతో   రాష్ట్రంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి జీవ‌నోపాధి కోసం   చిన్న‌ాచితికా ప‌నులు కూడా దొర‌క‌క పోవ‌డంతో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు రాష్ట్రాల‌కు పెద్ద సంఖ్య‌లో   వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల్లో జీవ‌నం సాగిస్తున్న ఏపీ ఓట‌ర్లు.. సొంత రాష్ట్రం వెళ్లి ఓటువేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. ఫ‌లితంగా ఓటింగ్ శాతం త‌గ్గింది. దాదాపు 60 నుంచి 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో వెయ్యి నుంచి 10వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్ధులు ఓడిపోయిన ప‌రిస్థితి. ఇత‌ర ప్రాంతాల‌కు ఉపాధికోసం వెళ్లిన‌ ఏపీ ఓట‌ర్లు ఆశించిన స్థాయిలో త‌మ రాష్ట్రంకు వెళ్లి ఓటు వేయ‌క‌పోవ‌డంవ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గ‌త ఐదేళ్ల‌లో పీక‌ల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.  

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 151 సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌గానికి పైగా స్వ‌ల్ప ఓట్ల మెజార్టీతో గెలిచిన సీట్లే. 20శాతం మంది ఓట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వైసీపీ అధికారంలోకి రావ‌డం.. ఏపీ ప్ర‌జ‌లు ఉపాధి కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే పేద‌ల‌కు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిలో వేగంగా జ‌రుగుతున్న ప‌నుల‌ను నిలిపివేశారు.   ఏపీ సీఎంగా చంద్ర‌బాబు కొన‌సాగిన‌ స‌మ‌యంలో అమ‌రావ‌తి, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరికింది. రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో కుల‌వృత్తుల వారికి పుష్క‌లంగా ప‌నులు దొర‌క‌డంతో ఆర్థికంగా వారికి వెసులుబాటు ఏర్ప‌డింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌క్ర‌బుద్ధితో వారి జీవ‌నోపాధిపై దెబ్బ‌కొట్టారు. అంతేకాదు.. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనుక‌బ‌డి పోయింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు పెద్దెత్తున పెట్టుబ‌డులు పెట్టాయి. జ‌గ‌న్ సీఎం హోదాలో వాట‌న్నింటిని ఏపీ నుంచి త‌రిమేశారు. అలాఅని కొత్త కంపెనీల‌నుకూడా ఏపీకి తీసుకురాలేదు. దీంతో యువ‌త ఉద్యోగాలు చేసుకునేందుకు అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేశారు. మ‌ట్టి, ఇసుక దోపిడీతో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు జేబులు నింపుకున్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయించి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. వైసీపీ నేత‌ల ఆగ‌డాలు త‌ట్టుకోలేక పోయిన చాలా మంది ఏపీని వ‌దిలి జీవ‌నోపాధికోసం ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్లిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనంత‌టికీ కార‌ణం.. ఇత‌ర రాష్ట్రాల్లోని ఏపీ ఓట్లు పోలింగ్ స‌మ‌యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోక పోవ‌టం వ‌ల్ల‌నేని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. 

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా క‌లిసి పోటీచేసి అధికారంలోకి వ‌చ్చాయి. 2014 నుంచి ఐదేళ్లు ఏపీలో ఎటుచూసినా అభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపించాయి. సీఎంగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుద‌ల‌తో ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న ప్ర‌ముఖ కంపెనీల‌ను ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా చేయ‌డం, పాత రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు, కొత్త రోడ్లు వేయ‌డం, యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌, ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని అద్భుతంగా నిర్మించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. చంద్ర‌బాబు హ‌యాలో ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని వ‌న‌రులుఉన్న‌ తెలంగాణ రాష్ట్రంతో పోటీప‌డింది. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అబివృద్ధి అనే ప‌దాన్ని మ‌ర్చిపోయి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగించి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైకో పాల‌న‌తో ఐదేళ్లు న‌ర‌క‌యాత‌నకుగురైన ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం ఆ బారినుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వ‌చ్చింది. ఓటు ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బుద్దిచెప్పి మ‌ళ్లీ ప్ర‌జాపాల‌నను తెచ్చుకొనే అవ‌కాశం ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలోఉన్న ఓట‌ర్లు, ఇత‌ర రాష్ట్రాల్లోఉన్న ఏపీ ఓట‌ర్లు  పోలింగ్ రోజు ఏపీలోని వారి స్వంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని. ఐదేళ్ల జగన్ దుర్మార్గ‌  పాల‌నకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.   జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓటు   ఆయుధంతో బుద్ధి చెప్పాలి.   నిర్ల‌క్ష్యం వీడి మేలుకో ఏపీ ఓటరా.. మ‌ళ్లీ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ఓటును ఆయుధంగా వినియోగించుకో.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీత బరిలోకి దిగారు.
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇక, ఇవాళ దేశంలో ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది.  ఐదో విడతలో భాగంగా 6  రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 1, లడఖ్ లో 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు
ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం గెలుపు ఓటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సారి గెలుపు విషయంలో తెలుగుదేశం కూటమివైపే బెట్టింగు రాయుళ్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (మే 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిడిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.