Publish Date:Oct 26, 2024
ఎవరు చేసిన కర్మ వారనుభవించకా తప్పదన్నా అన్నట్లుగా జగన్ హయాంలో ఇష్టారీతిగా, అడ్డగోలుగా అక్రమాలు, ఆక్రమణలు, కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా కేసుల పాలౌతున్నారు. కటకటాల పాలౌతున్నారు. అలాగే జగన్ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీతో అంటకాగిన ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా కూడా కేసుల భయంతో వణికిపోతున్నారు.
పలువురు అయితే ఎటువంటి పోస్టింగులకూ నోచుకోకుండా జీఏడీలో రిపోర్టు చేసి ఈగలు తోలుకుంటున్నారు. ఇప్పడు తాజాగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా వారి జాబితాలో చేరారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎంవీవీ ఇష్టారీతిగా కబ్జాలు, ఆక్రమణలతో చెలరేగిపోయారు. ఎంతగా అంటే ఆయనతో వ్యాపారాలు చేసిన వారికీ వాటాలు ఇవ్వకపోవడంతో వారు ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి బెదరించే వరకూ తెచ్చుకున్నారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో కప్పం చెల్లించుకుని కుటుంబ సభ్యులను విడిపించుకోగలిగారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు. దీంతో ఆయన పాత దందాలకు మూల్యం చెల్లించుకోకతప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు. ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలకు సైతం ఆయన చిక్కడం లేదు. వారి ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదు. ఇటీవల ఎంవీవీ నివాసం, కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాలలో ఎంవీవీ పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది. ఆ మేరకు ఒక ప్రకటన కూడా ఈడీ నుంచి వెలువడింది. తన నివాసాలపై ఈడీ దాడులు జరిగిన సమయంలో కూడా ఆయన విశాఖలో లేరు. ఈడీ సోదాల తరువాత ఎంవీవీ అరెస్టు భయంతో వణికిపోతున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా ఎంవీవీని ఈడీ ఇహనో ఇప్పుడో ఎంవీవీ అరెస్టు ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎంవీవీ కూడా తన అరెస్టు అనివార్యం అన్న నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. అందుకే ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనను తాను కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం కూటమి పార్టీల సహాయం కోరుతున్నారు. అవకాశం ఇస్తే వైసీపీకి గుడ్ బై చెప్పి వచ్చి చేరుతానంటూ రాయబారాలు పంపినట్ల ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కడ నుంచీ ఏ పార్టీ నుంచీ ఆయనకు సానుకూల స్పందన దక్కలేదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే అన్నట్లుగా ఎంవీవీని చేర్చుకోవడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు నిరాకరించాయని అంటున్నారు. దీంతో అన్ని దారులూ మూసుకుపోయి ఎంవీవీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vizag-former-mp-mvv-satyanarayana-petition-for-anticipatory-bail-25-187434.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.