రియల్ ఎస్టేట్ కోసమే విశాఖ రాజధాని ప్రమోషన్స్..!
Publish Date:Jun 8, 2021
Advertisement
సినిమా మీద క్రేజ్ పెంచాలంటే ఏదో ఒక లీకు ఇవ్వడం .. లేదంటే అప్డేట్ పేరుతో ఒక న్యూస్ ఇవ్వడం చేస్తుంటారు. లేదంటే ఆ టెంపో పడిపోతుంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా కలెక్షన్లు పెంచడానికి ప్రమోషనల్ ప్రెస్ మీట్స్ పెడుతుంటారు.. సినిమా హిట్ హిట్ అని పదే పదే వద్దన్నా చెబుతుంటారు. ఈ ఫార్ములా ఏ బిజినెస్ అయినా ఫాలో అవ్వాల్సిందే. ఏపీ వైసీపీ నేతల విశాఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే .. అదే ఫార్ములా ఫాలో అవక తప్పడం లేదు మరి. మూడు రాజదానులని చెప్పినా..అసలు రాజధాని విశాఖపట్నం అనేది అందరికీ తెలిసిందే.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయినా కాస్త జాగ్రత్తగా మాట్లాడారేమో గాని..ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడా లిమిట్,కంట్రోల్ లేకుండా చెలరేగిపోతూనే ఉన్నారు.భీమిలిలోనే రాజధాని ఏర్పాటవుతుందని ముందే చెప్పింది ఆయనే. ముందే భూములన్నీ కంట్రోల్ లోకి తీసుకున్నాకే ఈ ప్రకటనలు వచ్చాయని ఆరోపణలు వినపడుతూనే ఉన్నాయి. అయితే అమరావతి రైతులతో సహా, కొందరు హైకోర్టుకు వెళ్లడంతో..రాజధాని తరలింపుకు బ్రేకులు పడ్డాయి. అయినా అప్పటినుంచీ ఏదో ఒక విధంగా తరలించాలని ప్రయత్నాలు చేయడం మాత్రం ఆపలేదు. ఏదో ఒక లీకు ..అదిగో ఉగాదికి సీఎం వెళ్లిపోతారని..కాదు ఈసారి దసరాకు ఖాయం అని.. తర్వాత సంక్రాంతి అని.. కథలు నడిపించారు.కోర్టు బ్రేకులతో పాటు..కోవిడ్ సంక్షోభం కూడా అడ్డు వచ్చింది ఈసారి. అందుకే అప్పటి నుంచి దాని గురించి ఊసే లేకుండా పోయింది. కోవిడ్ నుంచి ఇప్పటికీ కోలుకోలేని ఏపీలో.. రాజధాని అంశం మరుగున పడింది. కోవిడ్ సంక్షోభం వల్లో.. రాజధాని లేటు అవుతుందనో మొత్తానికి విశాఖ రియల్ ఎస్టేట్ అనుకున్నంత స్పీడు అందుకోలేకపోగా.. కాస్త వెనక్కు తగ్గినట్లయింది. దీంతో దానిని లేపటానికి ఇప్పుడు సోకాల్డ్ నేతలు జాకీలు పట్టుకుని మరీ ట్రై చేస్తున్నారు. ఇలా గతంలో కూడా అవసరమైనప్పుడు తెరపైకి వచ్చి మంత్రులు స్టేట్ మెంట్లు ఇవ్వడం కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు చేయించారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖకు రాజధాని తరలింపు వేగవంతం చేయాలని జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కాని న్యాయపరమైన చిక్కులు తొలగకుండా ముందుకు పోవడానికి లేదని అధికారులు చెబుతున్నారని సమాచారం. పైగా తమ ప్రత్యర్ధి ఒకరు కీలకమైన స్థానంలోకి వచ్చాక.. ఆ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలనేది అధికారుల సూచన. ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం కోవిడ్ తగ్గుముఖం పట్టాక..ఏదో ఒక ముహూర్తం చూసుకుని.. అనధికారికంగా అయినా సరే సీఎం విశాఖలో కూర్చోవాలనే వ్యూహాన్ని పన్నారని..అదే ఫాలో కావాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఎన్నివ్యూహాలు పన్నినా..ఎలా చేసినా.. పైన వారి రహస్య స్నేహితుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే అడుగు వేయరని..ఎటూ ఆ రహస్య స్నేహితుడికి వీరి అవసరం కూడా పెరిగిన నేపథ్యంలో.. అది కూడా పెద్ద కష్టమేమి కాదనే అనిపిస్తోంది.
మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన అలాంటి జాకీయే. రాజధాని తరలింపు ఆగలేదని..ఏ క్షణమైనా జరగొచ్చని మంత్రిగారు చెప్పుకొచ్చారు. అబివృద్ధిని అడ్డుకునే శక్తులే కోర్టులకు వెళ్లి ఆటంకాలు సృష్టిస్తున్నాయని కూడా కామెంట్ చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజధాని విశాఖకు చేరుతుందని గ్యారంటీ కూడా ఇచ్చారు. ఇంతకీ సార్ ఇచ్చిన ష్యూరిటీలు, గ్యారంటీలన్నీ రియల్ ఎస్టేట్ వర్గాలకేనని విశాఖలో టాక్.
http://www.teluguone.com/news/content/vizag-capital-promotion-for-real-estate-bhoom-39-117181.html





