వివేకా హత్య కేసు దర్యాప్తు.. తదుపరి అరెస్టు అవినాష్ దేనా?

Publish Date:Apr 15, 2023

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందు ముందు మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ శుక్రవారం (ఏప్రిల్ 14) అరెస్టు చేసిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టును సీబీఐ శనివారం (ఏప్రిల్ 15)  కోర్టుకు సమర్పించింది.

ఆ రిమాండ్ రిపోర్టులో కూడా వైసీపీ ఎంపీ  ఎంపీ అవినాశ్ రెడ్డి పేరును ప్రస్తావించింది. వివేకా హత్య విషయం ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ పేర్కొంది. హత్య   అనంతరం వేకువ జామున ఆయన ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో ఉన్నారని పేర్కొంది. దీనికి సంబంధించి లొకేషన్ వివరాలను బయటపెట్టింది.

హత్య విషయం తెలిసిన నిముషాల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని సీబీఐ పూర్కొంది. ఈ నలుగురికి సంబంధించిన గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన లొకేషన్ వివరాలను రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. 
నలుగురూ కలిసి హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను మాయం చేసేయత్నం చేశారనీ, . అలాగే వివేకా గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని సీబీఐ ఆ నివేదికలో పేర్కొంది. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరించాకే ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.

ఉదయ్ కుమార్ రెడ్డి పరారి అవుతాడన్న అనుమానంతోనే అరెస్టు చేశామని తెలిపింది. ఇక ఉదయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించడం లేదనీ హత్య జరిగిన అనంతరం ఆయన లొకేషన్ వివరాలను ముందు పెట్టి ప్రశ్నించినా ఉదయ్ కుమార్ రెడ్డి నోరు మెదపడంలేదనీ పేర్కొంది. వివేకా హత్య కేసుకు సంబంధించి త్వరలోనే మరి కొందరు కీలక వ్యక్తులను అరెస్టు చేయనున్నట్లు సీబీఐ కోర్టులు నివేదించింది.  దీంతో తరువాత అరెస్టు ఎవరు అన్న చర్చ జోరందుకుంది. సీబీఐ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇహనో ఇప్పుడో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ వెల్లడించిన వివరాలు స్పష్టంగా, సూటిగా హత్య జరిగిన తరువాత ఎవరెవరు ఏం చేశారన్నది వివరంగా ఉండటంతో వివేకా హత్య కేసులో తదుపరి అరెస్టు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలేనని పలువురు అంటున్నారు.

గతంలో కూడా సీబీఐ హైకోర్టుకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలిపిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాలతో సీబీఐ విచారణాధికార మారడంతో సీబీఐ దర్యాప్తు ఒకింత మందగించినట్లు అనిపించింది. ఇంతలోనే ఉరుములేని పిడుగులా ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ అవినాష్ అరెస్టు ఎప్పుడున్న దానిపై కేంద్రీకృతమై ఉంది. ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ వివేకా హత్య తదననంతరం అవినాష్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సాక్ష్యాల మాయంకు ప్రయత్నించారని పేర్కొనడంతో ఆయన అరెస్టు కూడా అనివార్యమని భావిస్తున్నారు. 

By
en-us Political News

  
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.